సోమవారం, 23 డిశెంబరు 2024
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. ఆయుర్వేదం
Written By
Last Updated : శనివారం, 10 నవంబరు 2018 (16:01 IST)

తులసి ఆకులు నీటిలో మరిగించి తీసుకుంటే..?

ప్రతి ఇంట్లో తులసి మెుక్క తప్పకుండా ఉంటుంది. ఈ మెుక్కను లక్ష్మీదేవి స్వరూపంగా కొలుస్తారు. ఇటువంటి తులసితో కలిగే ఆరోగ్య ప్రయోజనాలు తెలుసుకుందాం..
 
తులసి ఆకుల్లోని పోషక విలువలు వ్యాధి నిరోధక శక్తిని పెంచుటకు సహాయపడుతాయి. కంటి సమస్యలను నుండి ఉపశమనం కలిగిస్తాయి. గొంతునొప్పి, దగ్గుగా ఉన్నప్పుడు తులసి ఆకులను నీటిలో మరిగించి అందులో కొద్దిగా ఉప్పు, నిమ్మరసం కలిపి తీసుకుంటే మంచి ఫలితాలు లభిస్తాయి. అధిక బరువు గలవారు ఈ నీటిని సేవిస్తే బరువు తగ్గుతారు.
 
తులసి ఆకులోని యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ వైరల్ గుణాలు శరీరంలో వ్యర్థ పదార్థాలను తొలగిస్తాయి. రేడియేషన్ దుష్పరిణామాలు శరీరంపై పడకుండా పరిరక్షిస్తుంది. ఎముకల బలాన్ని తులసి ఆకులతో కషాయం తయారుచేసి తీసుకుంటే మంచి ఉపశమనం లభిస్తుంది. అధిక రక్తపోటును అదుపులో ఉంచుతుంది. శరీరంలోని చెడు కొలెస్ట్రాల్‌ను బయటకు పంపుతుంది. 
 
శ్వాసకోశ సంబంధిత వ్యాధుల నుండి కాపాడుతుంది. తులసిలోని యాంటీ ఇన్‌ఫ్లమేటరీ గుణాలు ఇన్‌ఫెక్షన్స్‌ను తొలగిస్తాయి. గుండె ఆరోగ్యానికి చాలా మంచిది. తులసి ఆకుల పేస్ట్‌లా చేసుకుని ఆ మిశ్రమంతో కొద్దిగా ఉప్పు కలిపి పళ్ళు తోముకుంటే చిగుళ్ల సమస్యలు రావు. దంతాలు దృఢంగా ఉంటాయి. తులసిలోని విటమిన్ కె మధుమేహ వ్యాధిగ్రస్థులకు ఎంతో మంచిది.
 
సాధారణంగా చాలామందికి చిన్న వయసులోని తెల్ల జుట్టు వచ్చేస్తుంటుంది. ఆ తెల్ల జుట్టును తొలగించుకోవాడానికి రకరకాల నూనెలు, షాంపూలు వాడుతుంటారు. అయినా ఎలాంటి ఫలితాలు కనిపించవు. అందుకు తులసి ఆకులు దివ్యౌషధంగా పనిచేస్తాయి. తులసి ఆకులను పేస్ట్‌లా తయారుచేసుకుని అందులో కొద్దిగా పెరుగు, మెంతి పొడి, గోరింటాకు పొడి కలిపి తలకు రాసుకోవాలి. రెండు గంటల తరువాత గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకోవాలి. ఇలా తరచుగా వారానికి రెండుసార్లు చేయడం వలన తెల్ల జుట్టు రాదు.. జుట్టు రాలిపోకుండా ఉంటుంది. దాంతో చుండ్రు సమస్యలు కూడా తొలగిపోతాయి.