రోజుకో ఉడికించిన కోడిగుడ్డు తీసుకుంటే..?
చాలామంది గుడ్డు తినడానికి అంతగా ఇష్టపడరు. గుడ్డు ఆరోగ్యానికి చాలా మంచిది. దీనిలోని ఆరోగ్య ప్రయోజనాలు, పోషక విలువలు తెలుసుకుంటే.. గుడ్డు నచ్చని వారు కూడా ఇష్టపడి తింటారు. మరి ఉడికించిన గుడ్డు తీసుకుంటే కలిగే ఆరోగ్య విషయాలు తెలుసుకుందాం..
1. ఉడికించిన కోడిగుడ్డులో విటమిన్ ఎ, బి5, బి12, బి2, క్యాల్షియం, జింక్ వంటి ఖనిజాలు పుష్కలంగా ఉంటాయి. దాంతో పాటు 77 క్యాలరీలు, 6 గ్రాముల ప్రోటీన్స్ ఉన్నాయి. రోజూ ఓ గుడ్డును తీసుకుంటే చెడు కొలెస్ట్రాల్ తగ్గుతుంది. తద్వారా రక్తంలోని గ్లూకోజ్ లెవల్స్ కంట్రోల్ ఉంటాయి.
2. ఈ కాలంలో 70 శాతం మంది గుడ్డు తీసుకోవడం మానేస్తున్నారు. గుడ్డు తీసుకోకపోతే రోజు రోజూకి కొలెస్ట్రాల్ శాతం పెరిగిపోతుంది. దాంతో పాటు డయాబెటిస్ వచ్చే అవకాశాలున్నాయని నిపుణులు చెప్తున్నారు.
3. రోజూ ఉడికించిన గుడ్డు తీసుకోవడం వలన రక్తసరఫరా మెరుగుపడుతుంది. వ్యాధినిరోధక శక్తిని పెంచుతుంది. రక్తపోటును అదుపులో ఉంచుతుంది. గుండె సంబంధిత వ్యాధులు దరిచేరవు.
4. గుడ్డులోని విటమిన్ ఎ జ్ఞాపకశక్తిని పెంచుతుంది. కంటి సమస్యలతో బాధపడేవారు రోజుకు రెండు గుడ్లు తీసుకుంటే మంచి ఫలితం ఉంటుంది. దీనిలోని ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ లివర్ ఆరోగ్యానికి చాలా మంచిగా ఉపయోగపడుతుంది.
5. థైరాయిడ్ వ్యాధిని తగ్గిస్తుంది. మనిషికి శరీరానికి కావలసిన ముఖ్యమైన పదార్థం ప్రోటీన్స్. మరి ఈ ప్రోటీన్స్ ఎలా లభిస్తాయో చూద్దాం.. ఉడికించిన గుడ్డు తీసుకోవడం ద్వారా శరీరానికి అవసరమైయ్యే ప్రోటీన్స్ లభిస్తాయి.