కోల్డ్ కాఫీ తీసుకుంటున్నారా.. జాగ్రత్త..?
చాలామంది ఉదయాన్నే లేవగానే వేడివేడిగా కాఫీ లేదా టీ తాగుతుంటారు. ఎందుకంటే.. కాఫీ తాగితే రోజంతా ఉత్సాహంగా ఉంటారని వారి నమ్మకం. అలానే శరీరానికి కావలసిన ఎనర్జీ కూడా వస్తుందని చెప్తుంటారు. కానీ, ఇటీవలి కాలంలో కోల్డ్ కాఫీ తాగేవారు ఎక్కువగా ఉన్నారు. వేడి వేడి కాఫీ కంటే కోల్డ్ కాఫీ తీసుకోవడమే మంచిదని కొందరి నమ్మకం.
కానీ, అది అంత మంచిది కాదని వైద్యులు హెచ్చరిస్తున్నారు. సాధారణంగా ఆఫీసుల్లో పనిచేసేవారు ఏమనుకుంటారంటే.. కోల్డ్ కాఫీ తాగితే అలసట ఉండదని. అయితే అమెరికాలోని థామస్ జెఫర్సన్ యూనివర్సిటీ పరిశోధకులు చేసిన అధ్యయనంలో ఇది తప్పని తేలింది. కోల్డ్ కాఫీ కంటే వేడి వేడి కాఫీనే ఆరోగ్యానికి మంచిదని పరిశోధకులు అధ్యయనంలో తెలియజేశారు.
అసలు విషయం చెప్పాలంటే.. కోల్డ్ కాఫీలోని యాంటీ ఆక్సిడెంట్స్ కంటే వేడి కాఫీలోనే యాంటీ ఆక్సిడెంట్స్ పుష్కలంగా లభిస్తాయి. ఈ యాంటీ ఆక్సిడెంట్స్ మధుమేహ వ్యాధి నుండి కాపాడుతాయి. కనుక వీలైనంత వరకు కోల్డ్ కాఫీలు తీసుకోవడం మానేయండి.. లేదంటే జీర్ణాశయ సమస్యలు ఎదుర్కోవలసి వస్తుంది. దాంతో పాటు మధుమేహ వ్యాధి వచ్చే అవకాశాలున్నాయని పరిశోధనలో వెల్లడైంది.