శుక్రవారం, 24 జనవరి 2025
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. చిట్కాలు
Written By
Last Updated : మంగళవారం, 16 అక్టోబరు 2018 (12:48 IST)

ఉలవ గుగ్గిళ్లు, ఉలవచారు తింటున్నారా? లేదా?

ఈ కాలంలో ఉలవలు తీసుకోవడమే మానేశారు. ఎవరో ఒకరు తప్ప వీటిని అంతగా తినడం లేదు. కానీ పూర్వ కాలంలో మన పూర్వీకులు ఉలవలతో గంజి, గుగ్గిళ్లు, ఉలవచారు వంటి వంటకాలు తయారుచేసి తీసుకునేవారు. అందుకే వారు అప్పటి నుండి ఇప్పటి వరకు ఎలాంటి అనారోగ్య సమస్యలతో బాధపడకుండా ఆరోగ్యంగా ఉన్నారు.
 
ఉలవలలోని ఆరోగ్య ప్రయోజనాలు తెలుసుకుంటే కచ్చితంగా వీటిని తీసుకోవాలనిపిస్తుంది. అవేంటో చూద్దాం.. ఉలవల్లో క్యాల్షియం అధికంగా ఉంటుంది. ఇది ఎముకలు, దంతాలు బలాన్ని పెంచుతుంది. 
 
స్త్రీలకు ఉలవలు దివ్యౌషధంగా పనిచేస్తాయి. ఎందుకంటే చాలామంది మహిళలకు రుత సమయంలో ఎక్కువగా నొప్పులు వస్తుంటారు. అప్పుడు ఉలవలను బాగా వేయించుకుని పొడిలా చేసి అందులో కొద్దిగా ఉప్పు, నీళ్లు కలిపి తాగాలి. ఇలా చేస్తే ఆ నొప్పుల నుండి వెంటనే ఉపశమనం లభిస్తుంది. దాంతో కండరాలు పటిష్టంగా మారుతాయి. 
 
లివర్‌లోని విష, వ్యర్థ పదార్థాలను బయటకు పంపుటకు దోహదపడుతాయి. ఉలవలను నిత్యం గంజి, గుగిళ్లు రూపంలో తీసుకుంటే మధుమేహ వ్యాధి అదుపులో ఉంటుంది. తద్వారా అధిక బరువు కూడా తగ్గుతారు. ముఖ్యంగా జీర్ణ సమస్యలతో చాలామంది బాధపడుతుంటారు. అలాంటప్పుడు ఉలవల పొడిని అన్నంలో కలిపి తీసుకుంటే అల్సర్, గ్యాస్, అసిడిటీ వంటి సమస్యలు తొలగిపోతాయి.