సోమవారం, 23 డిశెంబరు 2024
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. కథనాలు
Written By
Last Updated : బుధవారం, 7 నవంబరు 2018 (11:58 IST)

పత్తి నూనె తీసుకుంటే..?

సాధారణంగా అందరి శరీరంలో చెడు కొలెస్ట్రాల్ ఉంటుంది. ఈ కొలెస్ట్రాల్ శరీరంలో ఉండడం వలన బరువు పెరిగే అవకాశాలున్నాయని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. దాంతో పాటు డయాబెటిస్ వచ్చే ప్రమాదం కూడా ఉందని చెప్తున్నారు. మరి ఈ కొలెస్ట్రాల్‌ను ఎలా తొలగించుకోవాలో చూద్దాం..
 
కొలెస్ట్రాల్‌ కరిగించడానికి పత్తి నూనె చాలా ఉపయోగపడుతుంది. ఇటీవలే చేసిన పరిశోధనలో పత్తి నూనె తీసుకునేవారికి శరీరంలోని చెడు కొలెస్ట్రాల్ శాతం చాలా తక్కువగా ఉందని వెల్లడైంది. కనుక 18 నుండి 45 ఏళ్ల వయసు గలవారు ప్రతిరోజూ తీసుకునే ఆహారంలో పత్తి నూనెను చేర్చుకుంటే కొలెస్ట్రాల్ తొలిగిపోతుంది. 
 
అంతేకాకుండా పత్తి నూనెలోని విటమిన్ ఈ గుండె వ్యాధుల నుండి కాపాడుతుంది. శరీరంలో వాపు, హృద్రోగాలు తొలగిపోతాయి. కొత్త చర్మ కణాలు పుట్టేలా చేస్తుంది. చిన్నారులకు జ్ఞాపకశక్తిని పెంచుతుంది. ఇన్ఫెక్షన్స్‌ తొలగిపోతాయి. పత్తి నూనెలోని యాంటీ ఆక్సిడెంట్స్ అనారోగ్య సమస్యల నుండి కాపాడుతాయి. శరీర రోగనిరోధక శక్తిని పెంచుతాయి.పత్తి నూనెతో తయారుచేసిన వంటకాలు తీసుకుంటే కొలెస్ట్రాల్ కరిగించవచ్చని నిపుణులు సూచిస్తున్నారు.