సోమవారం, 23 డిశెంబరు 2024
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. ఆయుర్వేదం
Written By
Last Updated : శనివారం, 3 నవంబరు 2018 (17:15 IST)

ఉల్లిపాయ పొట్టుతో చేసే సూప్‌ను తీసుకుంటే..

ఉల్లిపాయ పొట్టే కదా అని తీసిపారేయకండి.. ఉల్లిపొట్టుతో ఇవన్నీ చేయొచ్చు. అవేంటో చూద్దాం.. ఒక పాత్ర‌లో నీటిని తీసుకుని అందులో ఉల్లిపాయ పొట్టును వేయాలి. అనంత‌రం ఆ పాత్ర‌ను కిటికీలు లేదా గుమ్మం వ‌ద్ద పెడితే ఇంట్లోకి దోమ‌లు, ఈగ‌లు రావు. 
 
ఉల్లిపాయ పొట్టును రాత్రంతా నీటిలో నానబెట్టి ఉదయాన్ని ఆ పొట్టు తీసేసి ఆ నీటిని శరీరంపై రాసుకుంటే నొప్పులు, వాపులు తగ్గుతాయి. తలస్నానం చేసేటప్పుడు జుట్టుకు షాంపూ పెట్టకముందే పొట్టుతో బాగా మర్దన చేస్తే.. జుట్టు రాలే సమస్య వుండదు. 
 
అలాగే ఉల్లిపాయ పొట్టుతో సూప్ చేసుకుని తాగుతుంటే శ‌రీరంలోని చెడు కొలెస్ట్రాల్ పోతుంది. అంతేకాకుండా త‌ద్వారా అధిక బ‌రువు త‌గ్గ‌డ‌మే కాదు, గుండె స‌మ‌స్య‌లు కూడా రాకుండా ఉంటాయని ఆరోగ్య నిపుణులు చెప్తున్నారు. అలాగే ఉల్లిపాయ పొట్టుతో చేసే సూప్‌ను తీసుకోవడం ద్వారా ఇన్ఫెక్షన్లు నయమవుతాయి. అలాగే ఉల్లిపాయను రోజూ ఆహారంలో చేర్చుకుంటే.. ఆరోగ్యానికి, చర్మానికి ఎంతో మేలు జరుగుతుంది. ఉల్లిపాయ హృద్రోగాలను దూరం చేస్తుంది. కోలన్ క్యాన్సర్, ఒబిసిటీ, టైప్-2 డయాబెటిస్‌ను నయం చేస్తుంది.