మంగళవారం, 20 జనవరి 2026
  1. ఇతరాలు
  2. మహిళ
  3. సౌందర్యం
Written By
Last Updated : గురువారం, 1 నవంబరు 2018 (13:35 IST)

తేనె, శెనగపిండితో ఫేస్‌ప్యాక్ వేసుకుంటే..?

అరటిపండులోని విటమిన్ ఎ చర్మంలో లోపించే తేమను తిరిగి పోందేలా చేస్తుంది. పొడిబారిన, కాంతిహీనంగా ఉన్న చర్మానికి అరటిపండు మంచి ఔషధంగా పనిచేస్తుంది. మేకప్ ఎక్కువగా వేసుకుంటే.. చర్మం త్వరగా ముడతలు పడుతుందని చెప్తున్నారు. మరి ఆ ముడతల చర్మాన్ని అరటిపండుతో ఎలా తొలగించుకోవాలో చూద్దాం...
 
అరటిపండు తొక్కలను చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోని వాటిని మెత్తని పేస్ట్‌లా తయారుచేసుకోవాలి. ఈ మిశ్రమంలో కొద్దిగా తేనె, నిమ్మరసం, పెరుగు, ఆలియ్ నూనె వేసి బాగా కలిపి ముఖానికి ప్యాక్ వేసుకోవాలి. గంట తరువాత గోరువెచ్చని నీటితో ముఖాన్నిశుభ్రం చేసుకోవాలి. ఇలా వారానికి రెండుసార్లు చేయడం వలన ముఖం ముడతలు తొలగిపోయి తాజాగా మారుతుంది. 
 
తేనెలోని యాంటీ ఆక్సిడెంట్స్ వయసు మీద పడ్డ లక్షణాలు చర్మం మీద తొందరగా కనపడకుండా చేస్తాయి. అంతేకాకుండా మెుటిమలు, నల్లమచ్చలను తొలగిస్తుంది. చర్మానికి కావలసిన తేమను అందిస్తుంది. దీని ఫలితంగా చర్మం ముడతలు ఏర్పడకుండా ఉంటుంది. మరి తేనెతో ఫేస్‌ప్యాక్ ఎలా వేయాలో చూద్దాం...
 
తేనెలో కొద్దిగా చక్కెర, శెనగపిండి, పసుపు కలిపి పేస్ట్‌లా తయారుచేసుకోవాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి రాసుకుని అరగంట తరువాత చల్లని నీటితో శుభ్రం చేసుకోవాలి. ఇలా క్రమం తప్పకుండా చేస్తే ముఖం ముడతలు తొలగిపోతాయి. దాంతో ముఖంపై గల మెుటిమలు, నల్లటి మచ్చలు తొలగిపోతాయి మృదువుగా మారుతుంది.