బాదం, సోంపు పొడితో కంటి చూపు మెరుగు...
సాధారణంగా చిన్నపిల్లల నుండి పెద్దల వరకు కంటి చూపు కోల్పోయి.. అందుకు తగిన వైద్య చికిత్సలు తీసుకుంటున్నారు. దాంతో పాటు కళ్లజోడు కూడా పెట్టుకుంటున్నారు. ఈ కాలంలో చాలామందికి కంటి సమస్యలో అధికంగా బాధపడుతున్నారు. వయస్సు తేడా లేకుండా ఎవరు పడితే వారికి కంటి చూపు పోతుంది. అసలు చెప్పాలంటే పుట్టిన పిల్లలకు కూడా కంటి చూపు సరిగ్గా ఉండడం లేదు..
అందువలన కంటి చూపును మెరుగుపరచుటకు ఈ ఆహార పదార్థాలు తీసుకుంటే మంచి ఫలితాలు లభిస్తాయి. మరి అవేంటో తెలుసుకుందాం.. ఉసిరి కాయలో విటమిన్ సి సమృద్ధిగా ఉంటుంది. ఉసిరిలోని యాంటీ ఆక్సిడెంట్ కళ్ల లోపల ఉండే రెటీనాలో కొత్త కణాలు తయారయ్యేలా చేస్తాయి. కనుక ప్రతిరోజూ రెండుపూటలా ఉసిరి జ్యూస్ సేవిస్తే నేత్ర సమస్యలు తొలగిపోతాయి. ఒంటి ఉసిరి జ్యూస్ తాగలేనివారు అందులో కొద్దిగా తేనె కలిపి తీసుకుంటే కంటి చూపుకు ఇంకా మంచిది.
సాధారణంగా సోంపును భోజనం చేసిన తరువాత తీసుకుంటారు. ఎందుకంటే.. తిన్న ఆహారం జీర్ణమయ్యేందుకు.. లేదా నోటి తాజాదనం కోసం తీసుకుంటారు. కానీ సోంపు కంటి చూపును కూడా మెరుగుపరుస్తుందని చాలామందికి తెలియదు.. సోంపు కంటి చూపు కోల్పోయిన వారికి మంచి ఔషధంగా ఉపయోగపడుతుంది. మరి దానిని ఎలా ఉపయోగించాలో చూద్దాం..
కప్పు బాదం పప్పు, సోంపు గింజలు, కొద్దిగా చక్కెర వేసి మెత్తని పొడిలా తయారుచేసుకోవాలి. ప్రతిరోజూ రాత్రి సమయంలో నిద్రకు ఉపక్రమించే ముందుగా వేడివేడి పాలల్లో కొద్దిగా ఈ పొడి కలిపి తీసుకోవాలి. ఇలా రోజూ క్రమం తప్పకుండా సేవిస్తే కొద్ది రోజుల్లోనే కంటి చూపు బాగా కనిపిస్తుంది. బాదంలోని ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్, యాంటీ ఆక్సిడెంట్స్ కంటి సమస్యలు తొలగిస్తాయి. కనుక ప్రతిరోజూ బాదం పప్పులను నీటిలో నానబెట్టుకుని ఉదయాన్నే వాటి పొట్టు తీసి తింటే.. నేత్ర సమస్యలు పోతాయి.