ఆవనూనెలో పెరుగు కలిపి ముఖానికి రాసుకుంటే..?
బంగాళాదుంప రసం నల్లటి వలయాలు తొలగించేందుకు మంచి ఔషధంగా పనిచేస్తుంది. అందువలన ఈ రసంలో కొద్దిగా టమోటా రసం, నిమ్మరసం, రోజ్ వాటర్ కలిపి ముఖానికి రాసుకోవాలి. 20 నిమిషాల తరువాత శుభ్రం చేసుకుంటే ముఖం కాంతివంతంగా మారుతుంది. ఇలా చేయడం వలన ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ వుండవు.
అరటి తొక్కల్లో విటమిన్ ఎ, డి, ఇ, యాంటీ ఆక్సిడెంట్స్ చర్మం ఆరోగ్యాంగా ఉండేలా చేస్తాయి. అరటి పండు తొక్కలను మెత్తని పేస్ట్‌లా తయారుచేసుకుని ముఖానికి రాసుకోవాలి. 20 నిమిషాల తరువాత గోరువెచ్చని నీటితో కడిగేసుకోవాలి. ఇలా చేస్తే నల్లటి ముఖం కాస్త తెల్లగా మారుతుంది.
ఆవనూనెలో పెరుగు, చక్కెర, బాదం మిశ్రమం కలిపి పేస్ట్‌లా తయారుచేసుకుని ముఖానికి రాసుకోవాలి. గంటతరువాత చల్లని నీటితో శుభ్రం చేసుకోవాలి. ఇలా చేస్తే ముఖంపై గల జిడ్డు తొలగిపోతుంది. టమోటా రసంలో కొద్దిగా కీరదోస మిశ్రమం, పెరుగు, కలిపి ముఖానికి, మెడకు రాసుకోవాలి. 15 నిమిషాల తరువాత శుభ్రం చేసుకుంటే మంచి ఉపశమనం లభిస్తుంది.