ఆదివారం, 29 డిశెంబరు 2024
  1. ఇతరాలు
  2. మహిళ
  3. సౌందర్యం
Written By Kowsalya
Last Updated : బుధవారం, 3 అక్టోబరు 2018 (11:50 IST)

అవకాడో మిశ్రమం, కలబందతో ఫేస్‌ప్యాక్ వేసుకుంటే..?

అబ్బా.. ఈ మెుటిమల వలన ముఖం చూడటానికే విసుగుగా ఉంది. వీటిని తొలగించుకోవడానికి ఎన్నెన్నో క్రీములు, ఫేస్‌ప్యాక్స్ వాడి చూసాం. అయినా కూడా వీటి నుండి ఎలా విముక్తి చెందాలో తెలియడం లేదు.

అబ్బా.. ఈ మెుటిమల వలన ముఖం చూడటానికే విసుగుగా ఉంది. వీటిని తొలగించుకోవడానికి ఎన్నెన్నో క్రీములు, ఫేస్‌ప్యాక్స్ వాడి చూసాం. అయినా కూడా వీటి నుండి ఎలా విముక్తి చెందాలో తెలియడం లేదు. ఈ మెుటిమల వలన ముఖమంత నల్ల నల్ల మచ్చలుగా మారిపోయింది. అందుకు ఈ చిట్కాలు పాటిస్తే మంచి ఫలితాలు లభిస్తాయి.
 
పైనాపిల్ రసంలో కొద్దిగా టమోటా రసం, నిమ్మరసం కలుపుకుని పేస్ట్‌లా తయారుచేసుకుని ముఖానికి రాసుకోవాలి. 20 నిమిషాల తరువాత గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకోవాలి. ఇలా వారానికి రెండుసార్లు చేయడం వలన ముఖంపై గల మెుటిమలు తొలగిపోతాయి. అవకాడో మిశ్రమంలో కొద్దిగా కలబంద గుజ్జు కలిపి ముఖానికి ప్యాక్‌లా వేసుకోవాలి. 
 
అరగంట తరువాత చల్లని నీటితో శుభ్రం చేసుకుంటే ముఖం మెుటిమలు తొలగిపోయి మృదువుగా మారుతుంది. గుడ్డు సొనలో కొద్దిగా ఉప్పు, చక్కెర, వంటసోడా కలుపుకుని ముఖానికి రాసుకోవాలి. 10 నిమిషాల తరువాత శుభ్రం చేసుకుంటే మంచి ఉపశమనం లభిస్తుంది.