బుధవారం, 29 జనవరి 2025
  1. ఇతరాలు
  2. మహిళ
  3. సౌందర్యం
Written By Kowsalya
Last Updated : శనివారం, 29 సెప్టెంబరు 2018 (13:36 IST)

కలబంద గుజ్జు, పెరుగుతో.. నల్లటి మచ్చలు తొలగిపోతాయా..?

కొందరికి చిన్న వయస్సులోనే ముఖం మచ్చలుగా మారిపోతుంది. అందుకు పలు రకాల క్రీములు, వైద్య చికిత్సలు చేస్తుంటారు. అయినా కూడా ఎటువంటి ఫలితం లేదని బాధపడుతుంటారు. కనుక ఈ చిట్కాలు పాటిస్తే మంచి ఉపశమనం లభిస్తుంద

కొందరికి చిన్న వయస్సులోనే ముఖం మచ్చలుగా మారిపోతుంది. అందుకు పలు రకాల క్రీములు, వైద్య చికిత్సలు చేస్తుంటారు. అయినా కూడా ఎటువంటి ఫలితం లేదని బాధపడుతుంటారు. కనుక ఈ చిట్కాలు పాటిస్తే మంచి ఉపశమనం లభిస్తుంది.
 
కలబంద గుజ్జులో కొద్దికా పెరుగు, తేనె కలుపుకుని ముఖానికి రాసుకోవాలి. 20 నిమిషాల తరువాత గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకుంటే మంచి ఫలితం ఉంటుంది. దాంతో ముఖం మృదువుగా మారుతుంది. వంటసోడాలో కొద్దిగా ఉప్పు, చక్కెర కలుపుకుని ముఖానికి రాసుకోవాలి. అరగంట తరువాత శుభ్రం చేసుకుంటే ముఖంపై గల నల్లటి మచ్చలు తొలగిపోతాయి. 
 
మెుటిమల ప్రభారం వలనే ముఖంపై మచ్చలు ఏర్పడుతుంటాయి. కనుక ఆ మెుటిమలు ఎలా తొలగిపోవాలో తెలుసుకుందాం.. ఉల్లిపాయను గుజ్జులా చేసుకుని అందులో కొద్దిగా నిమ్మరసం, రోజ్ వాటర్ కలుపుకుని ముఖానికి రాసుకోవాలి. 20 నిమిషాల తరువాత శుభ్రం చేసుకోవాలి. ఇలా వారానికి రెండుసార్లు చేయడం వలన ముఖంపై మెుటిమలు, నల్లటి మచ్చలు తొలగిపోతాయి.