శనివారం, 11 జనవరి 2025
  1. ఇతరాలు
  2. మహిళ
  3. సౌందర్యం
Written By Kowsalya
Last Updated : శుక్రవారం, 28 సెప్టెంబరు 2018 (15:43 IST)

బ్రెడ్ ముక్కలు, మీగడతో.. ముఖం మృదువుగా..?

ముఖం మృదువుగా కనిపించాలంటే.. ఇలా చేయాలి. బియ్యపు పిండిలో కొద్దిగా పాలు కలుపుకుని ముఖానికి రాసుకోవాలి. 15 నిమిషాల తరువాత గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకోవాలి. ఇలా వారానికి రెండుసార్లు చేయడం వలన ముఖం మృ

ముఖం మృదువుగా కనిపించాలంటే.. ఇలా చేయాలి. బియ్యపు పిండిలో కొద్దిగా పాలు కలుపుకుని ముఖానికి రాసుకోవాలి. 15 నిమిషాల తరువాత గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకోవాలి. ఇలా వారానికి రెండుసార్లు చేయడం వలన ముఖం మృదువుగా మారుతుంది.
 
గుడ్డుసొనలో పెరుగు, అరటిపండు గుజ్జు కలుపుకుని మెడకు, ముఖానికి రాసుకోవాలి. అరగంట తరువాత చల్లని నీటితో కడిగేసుకోవాలి. దీంతో ముఖం మెుటిమలు, మచ్చలు తొలగిపోయి మృదువుగా, తాజాగా మారుతుంది. 
 
బ్రెడ్ ముక్కలు తినడానికే కాదు.. అందానికి కూడా చాలా ఉపయోగపడుతాయి. ఈ బ్రెడ్ ముక్కలను పేస్ట్‌లా తయారుచేసుకుని ఇందులో కొద్దిగా మీగడ కలుపుకుని ముఖానికి ప్యాక్‌లా వేసుకోవాలి. 20 నిమిషాల తరువాత శుభ్రం చేసుకుంటే ముఖం మృదువుగా మారుతుంది.