శనివారం, 9 నవంబరు 2024
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. కథనాలు
Written By Kowsalya
Last Updated : బుధవారం, 26 సెప్టెంబరు 2018 (20:38 IST)

ఒమెగా 3 ఫ్యాటీ యాసిడ్స్ ఆహార పదార్థాలు.. గుండెపోటుకు..?

ప్రతిరోజూ మనం తీసుకునే ఆహారంలో విటమిన్స్, మినరల్స్, ప్రోటీన్స్ వంటి పదార్థాలు అధికంగా ఉంటాయి. వీటిలో పాటు ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ అనే పోషకాలు కూడా అనేక ఆహార పదార్థాలలో ఉంటాయి. ఈ పదార్థం మెదడుకు పోషణ అ

ప్రతిరోజూ మనం తీసుకునే ఆహారంలో విటమిన్స్, మినరల్స్, ప్రోటీన్స్ వంటి పదార్థాలు అధికంగా ఉంటాయి. వీటిలో పాటు ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ అనే పోషకాలు కూడా అనేక ఆహార పదార్థాలలో ఉంటాయి. ఈ పదార్థం మెదడుకు పోషణ అందిస్తుంది. రక్త నాళాలు, ఊపిరితిత్తులు ఆరోగ్యాంగా ఉండేలా చేస్తుంది. శరీర రోగనిరోధక శక్తిని పెంచుటకు మంచిగా ఉపయోగపడుతుంది. ఇటువంటి పదార్థం ఏయే ఆహారాల్లో ఉందో తెలుసుకుందాం.
 
గుమ్మడికాయ విత్తనాలు, అవిసె గింజలు, గుడ్లు, చేపలు, వాల్‌నట్స్, పల్లీలు వంటి వాటిల్లో ఒమెగా 3 ఫ్యాటీ యాసిడ్స్ పుష్కలంగా ఉంటాయి. ఈ ఆహార పదార్థాలను తరుచుగా డైట్‌లో చేర్చుకోవడం వలన శరీరానికి కావలసిన పోషక విలువలు అందుతాయి. ఈ ఒమెగా 3 ఫ్యాటీ యాసిడ్ ఆస్తమా, శరీర వాపులు, నొప్పుల నుండి ఉపశమనం కలిగిస్తుంది. 
 
ముఖ్యంగా ఈ పదార్థం నిద్రలేమి సమస్య నుండి కాపాడుతుంది. అమెరికన్ హార్ట్ అసోసియేషన్ వాళ్లు ఒమెగా 3 ఫ్యాటీ యాసిడ్స్ ఉండే చేపలను అధికంగా ఆహారంలో చేర్చుకుంటే రక్తనాళాల్లో కొవ్వు పేరుకుపోకుండా ఉంటుందని చెబుతున్నారు. దీంతో గుండెపోటు రాకుండా ఉంటుంది.