గురువారం, 26 డిశెంబరు 2024
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. ఆయుర్వేదం
Written By selvi
Last Updated : సోమవారం, 1 అక్టోబరు 2018 (14:27 IST)

తొడల మధ్య దద్దుర్లు.. ఒబిసిటీ కారణమా? చిట్కాలు (Video)

పరుగుల జీవితం నేపథ్యంలో ఆరోగ్యంపై శ్రద్ధ చూపని వారి సంఖ్య పెరిగిపోతుంది. ఈ కారణంగా ఒబిసిటీ తప్పట్లేదు. ఈ ఒబిసిటీ కారణంగా ఇన్ఫెక్షన్లు పెరిగిపోతున్నాయి. ముఖ్యంగా తొడల మధ్య దద్దుర్లు ఏర్పడేందుకు ఒబిసిటీ

పరుగుల జీవితం నేపథ్యంలో ఆరోగ్యంపై శ్రద్ధ చూపని వారి సంఖ్య పెరిగిపోతుంది. ఈ కారణంగా ఒబిసిటీ తప్పట్లేదు. ఈ ఒబిసిటీ కారణంగా ఇన్ఫెక్షన్లు పెరిగిపోతున్నాయి. ముఖ్యంగా తొడల మధ్య దద్దుర్లు ఏర్పడేందుకు ఒబిసిటీ కారణమని ఆయుర్వేద నిపుణులు చెప్తున్నారు.


తొడల మధ్య దద్దుర్లు చిరాకు కలిగిస్తాయి. ఈ ఇబ్బంది స్త్రీపురుషుల్లో వుంటే అసౌకర్యం తప్పదు. ఇంకా మెదడు పనితీరు కూడా మందగిస్తుంది. అసౌకర్యం, ఇబ్బంది కారణంగా ఏ పనిని ఏకాగ్రతతో పూర్తి చేయలేరని వైద్యులు చెప్తున్నారు. అందుకే ఇన్ఫెక్షన్లను నిర్లక్ష్యంగా వదిలిపెట్టకూడదని వైద్యులు చెప్తున్నారు. 
 
అందుకే ఇన్ఫెక్షన్లు దూరం చేసుకునేందుకు పోషకాహారం తీసుకోవాలి. విటమిన్ సి పుష్కలంగా వుండే ఆహార పదార్థాలను డైట్‌లో చేర్చుకోవాలి. తొడల మధ్య దద్దుర్లు నుంచి నివారణ పొందాలంటే.. తొడల మధ్య తేమ లేకుండా చూసుకోవాలి. తేమకు కారణం బిగువుగా ఉన్న దుస్తులు వేసుకోవడం. ఇది ఫంగస్‌ని ఎక్కువ చేస్తుంది. నడిచేటప్పుడు తొడలు రాసుకోవడం ద్వారా దురద తప్పదు. అందుకే స్నానం చేసిన తర్వాత ఈ జాగ్రత్తలు తీసుకోవాలని ఆయుర్వేద నిపుణులు సూచిస్తున్నారు.
 
అవేంటంటే..?
1. స్నానానికి తర్వాత శుభ్రమైన టవల్‌తో తేమ లేకుండా తుడవాలి
2. డయాబెటిస్ వుందా అని పరీక్షించుకోవాలి
3. వదులుగా వున్న దుస్తులను మాత్రమే ధరించాలి 
4. ఎప్పుడూ చర్మాన్ని పొడిగా వుంచుకోవాలి. 
5. పొడులు లేదా నూనెలు ఉపయోగించడం మంచిది కాదు. 
 
6. లోదుస్తులు సౌకర్యంగా వుండేట్లు ధరించాలి.
7. ఇతరుల లోదుస్తులు వాడకూడదు. 
8. మీ దుస్తులు, టవల్స్ ఇతరులతో పంచుకోవద్దు.  
9. బేకింగ్ సోడాని నీటిలో కలిపి తడిగా ఉన్న చర్మాన్ని కడగటం వలన ఉపశమనం లభిస్తుంది. 
10.  వేపాకులను వేడి నీటిలో కలిపి స్నానం చేయాలి
 
11. వోట్‌మీల్‌ను నీటిలో కలిపి రాసుకుని అరగంట తర్వాత కడిగేయాలి. 
12. ఒక శుభ్రమైన గుడ్డలో మంచు గడ్డలను మూటగట్టి తొడల మధ్యభాగంలో కొంత సేపు రుద్దటం వలన ఉపశమనం లభిస్తుంది. 

13. అలోవెరా జెల్‌ను ఇబ్బంది వున్న చర్మంపై 20 నిమిషాల పాటు మర్దన చేస్తే.. ఉపశమనం లభిస్తుంది.
14. అలాగే దద్దుర్లు వున్న చోట పసుపు రాయడం లేదా స్నానపు నీటిలో పసుపును కలిపి స్నానం చేయడం వలన ఈ సమస్య తగ్గుతుంది.  

15. అంతేగాకుం కొబ్బరి నూనె, ఆలివ్ నూనె, నువ్వుల నూనెను తొడల మధ్య దద్దుర్లున్న చోట రాత్రి పూట రాసుకుని ఉదయం స్నానం చేయాలి. ఇది ఇన్ఫెక్షన్లను దూరం చేస్తుందని ఆయుర్వేద నిపుణులు సూచిస్తున్నారు.