గుప్పెడు స్ట్రాబెర్రీలను రోజూ తీసుకుంటే..?
స్ట్రాబెర్రీల్లోని ఫ్లేవనాయిడ్‌లు గుండె పనితీరును మెరుగుపరుస్తాయి. క్యాన్సర్‌ను నిరోధిస్తాయి. వీటిలో మాంగనీస్, విటమిన్ సి వంటి పోషకాలు సమృద్ధిగా ఉంటాయి. ఈ గుప్పెడు స్ట్రాబెర్రీలను మిల్క్ షేక్స్, సలాడ్స్‌లలో వేసుకుని తీసుకోవడం ద్వారా ఆరోగ్యానికి ఎంతో మేలు చేకూరుతుందని న్యూట్రీషన్లు అంటున్నారు.
అలాగే కంటి ఆరోగ్యానికి క్యారెట్స్, స్ట్రాబెర్రీలు చాలా ఉపయోగపడుతాయి. ముఖ్యంగా స్ట్రాబెర్రీలను తరుచుగా ఆహారంగా తీసుకోవడం వలన కంటి ఆరోగ్యానికి మంచిగా దోహదపడుతుంది. కొంతమంది చిన్న వయస్సులోనే కంటి చూపును కోల్పోతుంటారు. అటువంటివారికి స్ట్రాబెర్రీ పండ్లు చక్కటి ఔషధంగా సహాయపడుతాయి.
ఈ పండ్లలో గల యాంటీ ఆక్సిడెంట్స్ క్యాన్సర్ సంబంధిత వ్యాధుల నుండి కాపాడుతాయి. గర్భిణులకు కావలసిన ముఖ్యమైన పోషకం ఫోలిక్ యాసిడ్. ఈ పదార్థం గర్భంలోని శిశువు వెన్నెముక సంబంధిత లోప సమస్యలను నివారిస్తుంది. అందుకే స్ట్రాబెర్రీలను గర్భిణీలు తీసుకోవాలని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.
ఈ ఫోలిక్ యాసిడ్ ఎర్రరక్తకణాలు వృద్ధిచెందడానికి, మెదడు పనితీరును మెరుగుపరచడానికి సమర్థంగా పనిచేస్తుంది. చర్మం మీద దద్దుర్లు, తలనొప్పి, నిద్రలేమి, అలర్జీ వంటి సమస్యలు గల వారు మాత్రం ఎట్టిపరిస్థితులలోనూ స్ట్రాబెర్రీ పండ్లను తీసుకోకూడదని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.