గురువారం, 28 మార్చి 2024
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. ఆయుర్వేదం
Written By
Last Updated : బుధవారం, 7 నవంబరు 2018 (15:11 IST)

పెరుగుతో అరటి పండు చేర్చితే..?

ఈ రోజుల్లో అందరు ఏవంటే అవి తినకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఎందుకంటే.. ఈ కాలంలో వచ్చే అనారోగ్యాల సమస్యలను తొలగించడానికి.. మరి అనారోగ్యాలకు చెక్ పెట్టే కొన్ని చిట్కాలను తెలుసుకుందాం..
 
పెరుగు చలికాలంలో అంత మంచిగా కాదని కొందరి మాట. కానీ, పెరుగులోని ఆరోగ్య ప్రయోజనాలు వేరే పదార్థాలలో దొరకవు. కాబట్టి పెరుగులో కొద్దిగా కొబ్బరి పాలు చేర్చి అందులో అరటిపండు ముక్కలు, తేనె వేసుకోవాలి. ఈ మిశ్రమాన్ని ఫ్రిజ్‌లో గంటపాటు అలానే ఉంచాలి. కాసేపటి తరువాత ద్రాక్ష పండ్లు వేసి సేవిస్తే ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. 
 
బంగాళాదుంప చిప్స్ అంటే నచ్చని వారు ఎవ్వరు ఉండరు. కానీ, ఈ చిప్స్ ఆరోగ్యానికి అంత మంచిది కాదని చెప్తున్నారు. వీటికి బదులుగా చిలగడ దుంపల చిప్స్ తీసుకోవచ్చును. దుంపలను స్లైసుల్లా కట్ చేసి ఓవెన్‌లో వేయించాలి. వాటిపై కొద్దిగా ఉప్పు, కారం, మిరియాల పొడి చల్లి తీసుకుంటే చాలా రుచిగా ఉంటుంది. ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. 
 
శీతలపానీయాలకు బదులు తాజా పండ్ల రసాలు తీసుకుంటే మంచిది. ఎందుకంటే.. ఈ చలికాలంలో శీతలపానీయాలు తీసుకుంటే జలుబు, దగ్గు, జ్వరాలు వచ్చే అవకాశాలున్నాయి. కనుక పండ్ల రసాలు సేవిస్తే మంచి ఉపశమనం లభిస్తుంది. ఓ సీసాలో కొన్ని నీళ్లుపోసి అందులో కొద్దిగా తులసి, పుదీనా, నిమ్మచెక్క, కీరా ముక్క వేసి బాగా మరిగించుకోవాలి. ఈ మిశ్రమాన్ని రాత్రివేళల్లో తీసుకుంటే శరీరంలోని వ్యర్థాలు తొలగిపోతాయి.