శుక్రవారం, 26 ఏప్రియల్ 2024
  1. ఇతరాలు
  2. మహిళ
  3. సౌందర్యం
Written By
Last Updated : శుక్రవారం, 2 నవంబరు 2018 (11:27 IST)

జీలకర్ర పొడి, కీరదోస రసంతో నల్లటి వలయాలు మటాష్..

రోజంతా కంప్యూటర్ల ముందు కూర్చుంటే కంటి కింద నల్లటి వలయాలు ఏర్పడుతాయి. దాంతో ముఖం తాజాదానాన్ని కోల్పోతుంది. ఈ నల్లటి వలయాలు తొలగించాలని రకరకాల క్రీములు, ఫేస్‌ప్యాక్స్ వాడుతుంటారు. అయినా కూడా ఎలాంటి లాభాలు కనిపించవు. మరి ఏం చేయాలి.. అంటూ.. ఆందోళన చెందుతారు. దీనికి ఇంట్లోని చిట్కాలు పాటిస్తే మంచి ఫలితాలు లభిస్తాయి.. అవేంటంటే..
 
పెరుగు ఆరోగ్యానికి ఎంత మంచిదో అందానికి అంతే మంచిగా ఉపయోగపడుతుంది. పెరుగుతో కొద్దిగా చక్కెర, నిమ్మరసం, తేనె కలిపి ముఖానికి రాసుకోవాలి. అరగంట తరువాత గోరువెచ్చని నీటితో ముఖాన్ని శుభ్రం చేసుకోవాలి. ఇలా వారానికి మూడుసార్లు తరచుగా చేస్తే కంటి కిందటి నల్లటి వలయాలు తొలగిపోతాయి. దాంతో ముఖం తాజాగా మారుతుంది. 
 
పాలలోని విటమిన్స్, మినరల్స్, క్యాల్షియం కంటి ఆరోగ్యానికి మంచి ప్యాక్‌లా పనిచేస్తుంది. నల్లటి వలయాలు తొలగించాలంటే.. పాలలో కొద్దిగా శెనగపిండి, కలబంద గుజ్జు వేసి పేస్ట్‌లా తయారుచేసుకోవాలి. ఈ మిశ్రమాన్ని కంటి కింద రాసుకుని గంటపాటు అలానే ఉంచుకోవాలి. ఆ తరువాత శుభ్రం చేసుకుంటే మంచి ఉపశమనం లభిస్తుంది.
 
జీలకర్రలోని యాంటీ ఆక్సిడెంట్స్ కంటి అందానికి మంచి ప్యాక్‌లా పనిచేస్తాయి. జీలకర్రను పొడిచేసి అందులో కొద్దిగా నీరు, కీరదోస రసం కలిపి ముఖానికి రాసుకోవాలి. 20 నిమిషాల తరువాత చల్లని నీటితో శుభ్రం చేసుకోవాలి. ఇలా క్రమంగా తప్పకుండా చేస్తే నల్లటి వలయాలు తొలగిపోతాయి. దాంతో ముఖం కాంతివంతంగా మారుతుంది.