సోమవారం, 6 జనవరి 2025
  1. ఇతరాలు
  2. మహిళ
  3. సౌందర్యం
Written By
Last Updated : సోమవారం, 5 నవంబరు 2018 (16:34 IST)

ముల్తానీ మట్టిని తేనె, బాదం లేదా జీడిపప్పుతో పేస్ట్ చేసి?

చర్మంలోని మృత కణాలను తొలగించడంలో ముల్తానీ మట్టికి మంచి పేరుంది. చర్మంలోని పొరల్లో ఉన్న మృత కణాలను ఇది తొలగిస్తుంది. దీంతో చర్మం గాలిని పీల్చుకోగలుగుతుంది. ముల్తానీ మట్టిని తేనె, బాదం లేదా జీడిపప్పుతో కలిపి మిక్సర్‌లో పేస్ట్‌లా చేసుకోవాలి. దీంతో ముఖానికి రాసుకుంటే.. జిడ్డు తొలగిపోతుంది. వైట్, బ్లాక్ హెడ్స్ అన్నీ పోతాయి. 
 
చర్మం నిగారింపునకు ముల్తానీ మట్టి మంచి పరిష్కారం. రెండు మూడు చెంచాల ముల్తానీ మట్టి, ఒక స్పూను పెరుగు, ఒక స్పూను కీరదోస, రెండు చెంచాల శెనగ పిండి, పాలు అన్నీ కలిపి ఆ మిశ్రమాన్ని ముఖం, మెడపై రాసుకోవాలి. 20 నిమిషాల తర్వాత కడిగేసుకుంటే చర్మం మెరిసిపోతుంది.
 
కళ్ల కింద నల్లటి వలయాలు, మెడపై, ముఖంపై నల్లమచ్చలుంటే.. ఆలుగడ్డ కోరులో సగం తీసుకుని దానికి తాజా నిమ్మరసం, ముల్తానిమట్టి, ఒకస్పూను తాజా వెన్న కలిపిన మిశ్రమాన్ని కళ్లు మూసుకుని చుట్టూ కళ్లపై ప్యాక్‌లా వేసుకోవాలి. అరగంట తర్వాత కడిగేసుకోవాలి.