గురువారం, 26 డిశెంబరు 2024
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. కథనాలు
Written By
Last Updated : బుధవారం, 21 నవంబరు 2018 (17:23 IST)

నోటి దుర్వాసనకు మిరియాల పొడి.. ఎలా పనికొస్తుందో తెలుసా?

మిరియాల పొడిని తేనెలో కలిపి తీసుకుంటే వర్షాకాలంలో జలుబు, దగ్గును దూరం చేసుకోవచ్చు. ఒక స్పూన్  మిరియాల పొడిని, గరిక పొడిని చేర్చి.. కషాయంలా తాగితే పురుగు కాటుకు మంచి ఔషధంగా పనిచేస్తుంది. జలుబు, జ్వరం వస్తే.. పావు స్పూన్ మిరియాల పొడిని పాలలో కలిపి తీసుకుంటే మంచి ఉపశమనం కలుగుతుంది. అందులో కాస్త పసుపు పొడిని చేర్చితే అలర్జీలు దూరమవుతాయి. 
 
పది తులసీ ఆకులతో పావు స్పూన్ మిరియాల పొడిని చేర్చి ఒక గ్లాసుడు నీటిలో మరిగించి తాగినట్లైతే.. వ్యాధులు దరిచేరవు. మొటిమలతో ఇబ్బంది పడేవారు.. చందనం, జాజికాయతో పాటు మిరియాలను చేర్చి బాగా  పేస్టులా చేసుకుని మొహానికి పూతలా వేసుకుంటే మంచి ఫలితం వుంటుంది. క్యాన్సర్‌ను మిరియాల పొడి దూరం చేస్తుంది. మిరియాలతో, పసుపును చేర్చి వంటల్లో వాడితే క్యాన్సర్‌ను దూరం చేసుకోవచ్చు.
 
దంత సమస్యలకు మిరియాల పొడి, ఉప్పు దివ్యౌషధంగా పనిచేస్తాయి. నోటి దుర్వాసనకు మిరియాల పొడి, ఉప్పుతో బ్రష్ చేస్తే మంచి ఫలితం వుంటుంది. జలుబుతో ఇబ్బంది పడుతున్నవారు.. మిరియాల పొడిని దోరగా వేయించి మూడు పూటలా అరస్పూన్ మేర తీసుకుంటే ఉపశమనం వుంటుందని ఆయుర్వేద నిపుణులు సూచిస్తున్నారు.