గురువారం, 26 డిశెంబరు 2024
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. కథనాలు
Written By
Last Updated : బుధవారం, 21 నవంబరు 2018 (11:11 IST)

వర్షాకాలంలో కీరదోస అరకప్పు చాలు..

వర్షాకాలంలో కీరదోస కాయ అరకప్పు చాలునని.. అలా వర్షాకాలం, శీతాకాలంలో అరకప్పు కీరదోసకాయ జ్యూస్ తాగితే వ్యాధినిరోధక శక్తిని పెంచుకోవచ్చు. వర్షాకాలంలో అలెర్జీలను దూరం చేసుకోవాలంటే.. శరీరంలోని టాక్సిన్లను తొలగించుకోవాలంటే.. రోజూ డైట్‌లో కీరదోసకాయను చేర్చుకోవాలని ఆయుర్వేద నిపుణులు సూచిస్తున్నారు. 
 
హైబీపీ అదుపులోకి రావాలంటే... రోజు కనీసం ఒక కీరదోస కాయను తీసుకోవటం మంచి మార్గం. ఇందులో విటమిన్ కె ఎముకల పనితీరును మెరుగుపరుస్తుంది. న్యూరాన్ల పనితీరును మెరుగుపరిచి.. అల్జీమర్స్‌ సమస్యను నివారిస్తుంది. గ్యాస్ట్రిక్స్ అల్సర్ నుంచి ఉపశమనాన్ని ఇస్తుంది. జుట్టు పెరగడానికి దోహదం చేస్తుంది. చిగుళ్ల సమస్యలను, మూత్ర సంబంధ సమస్యలను నివారిస్తుంది. 
 
మధుమేహంతో బాధపడేవారు రోజూ కీరదోసను డైట్‌లో చేర్చుకోవచ్చు. బరువు తగ్గడానికి కీరదోస మెరుగ్గా పనిచేస్తుంది. స్థూలకాయంతో బాధపడే వారు హాయిగా కీరదోసను ఆహారంలో చేర్చుకోవచ్చు.