మంగళవారం, 26 నవంబరు 2024
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. చిట్కాలు
Written By
Last Updated : బుధవారం, 21 నవంబరు 2018 (09:53 IST)

ఎక్కిళ్లు ఎలా ఆపొచ్చు...

చాలామంది ఎక్కిళ్లు తరచుగా వస్తుంటాయి. వీటికి కారణం ఛాతి అడుగున ఉండే డయాఫ్రమ్ అసంకల్పితంగా స్పందించినపుడు కలిగే శారీరక మార్పే ఎక్కిళ్ళు. ఇలా జరటానికి చాలా కారణాలున్నాయి. అయితే, ఎక్కిళ్లు రాకుండా ఉండాలంటే ఎక్కిళ్లను ప్రేరేపించే విషయాలకు, తినుబండరాలకు దూరంగా ఉంటే చాలు. అవేంటంటే... 
 
* మద్యం, సిగరెట్లు తాగకూడదు. 
* శీతలపానీయాలకు దూరంగా ఉండాలి.
* హఠాత్తుగా ఆందోళనకు గురికావడం, హఠాత్తుగా ఉత్తేజితమవటం వంటివి చేయరాదు.
* వేగంగా తినే అలవాటును మార్చుకోవాలి.
* ఎక్కువ తినడం, తాగడాన్ని తగ్గించుకోవాలి.
 
ఒకవేళ ఎక్కిళ్లను ఆపాలనుకుంటే ఈ కింది చిట్కాలు పాటించాలి. 
* ఒక నిమ్మకాయను కొరికితే వెక్కిళ్లు ఆగిపోతాయి. 
* ముక్కును గిల్లడం, కొద్దిసేపు ఊపిరి బిగపట్టడం. 
* నీళ్లతో నోరు పుక్కిళించడం లేదా చల్లని నీరు తాగడం వల్ల ఎక్కిళ్లు ఆపొచ్చు. 
* నోటిలో ఒక స్పూన్ చక్కెర లేదా తేనె వేసుకున్నట్టయితే ఇవి ఆగిపోతాయి.