మంగళవారం, 26 నవంబరు 2024
  1. ఇతరాలు
  2. మహిళ
  3. కథనాలు
Written By
Last Updated : ఆదివారం, 18 నవంబరు 2018 (11:25 IST)

నెలసరి ఆలస్యమైతే గర్భందాల్చినట్టా?

చాలామంది మహిళలకు నెలసరి ఆలస్యమవుతుంది. దీనివల్ల తాము గర్భందాల్చామనే అనుమానం వారిని వేధిస్తుంది. నిజానికి నెలసరి ఆలస్యం కావడానికి అనేక కారణాలు లేకపోలేదు. శరీరక, మానసిక కారణాలున్నాయి. సాధారణంగా స్త్రీ జీవితంలో రెండు సందర్భాల్లో మాత్రమే నెలసరి సమస్యలు ఏర్పడతాయి. అవి ఒకటి.. నెలసరి ప్రారంభంలో. రెండోది మోనోపాజ్ దశలో. ఈ రెండు సందర్భాల్లో మినహా నెలసరి తేదీల్లో ఎపుడూ హెచ్చుతగ్గులు చోటుచేసుకున్నా పలు కారణాలపై దృష్టిసారించాల్సి ఉంటుంది.
 
* ఒక్కసారిగా ఉన్నట్టుండి ఒకేసారి విపరీతమైన బరువు తగ్గితే నెలసరి ఆలస్యంకావొచ్చు. 
* గర్భనిరోధక మాత్రలు, సూదులు వాడినట్టయితే నెలసరి క్రమం తప్పవచ్చు. 
* అవసరానికి మించి థైరాయిడ్ హార్మోన్ స్రవించినా, సరిపడా థైరాయిడ్ తయారుకాని పక్షంలో నెలసరిలో జాప్యం జరుగుతుంది. 
* ఒత్తిడి వల్ల తలనొప్పి, చర్మ సమస్యలు, బరువు పెరగడంతో పాటు నెలసరి కూడా ఆలస్యమవుతుంది. ఒత్తిడికి లోనయినపుడు శరీరం అడ్రినలిన్, కార్టిసాల్, అనే స్ట్రెస్ హార్మోన్లను ఉత్పత్తి చేస్తుంది. ఈ హార్మోన్ల ప్రభావం వల్ల పునరుత్పత్తి గతితప్పి నెలసరి ఆలస్యమవుతుంది.