1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
  4. Iranian Supreme Leader Ayatollah Khamenei Reported Dead

ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీని ఖతం చేసిన అమెరికా-ఇజ్రాయెల్ బలగాలు

Khameni
ఇరాన్ సుప్రీం నాయకుడు ఆయతుల్లా అలీ ఖమేనీని ఖతం చేసాయి అమెరికా-ఇజ్రాయెల్ బలగాలు. ఖమేనీ మరణాన్ని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ధృవీకరించారు. ఇజ్రాయెల్‌తో కలిసి నిర్వహించిన అధునాతన వైమానిక దాడిలో, టెహ్రాన్‌లోని ఖమేనీ కార్యాలయం, రహస్య ప్రదేశాలు నేలమట్టం చేయబడ్డాయి. నివేదికల ప్రకారం, ఈ దాడిలో ఖమేనీతో పాటు ఇరాన్ రక్షణ మంత్రి, రివల్యూషనరీ గార్డ్ యొక్క అగ్ర కమాండర్లు మరణించారు. ఖమేనీ కుటుంబ సభ్యులు కూడా ప్రాణాలు కోల్పోయినట్లు తెలుస్తోంది.
 
ఖమేనీ మృతదేహం కనుగొనబడినట్లు ఫోటోగ్రాఫిక్ ఆధారాలను ట్రంప్, నెతన్యాహుకు సమర్పించినట్లు ఇజ్రాయెల్ మీడియా నివేదించింది. చరిత్రలో అత్యంత చెత్త నియంతలలో ఒకరు మట్టిలో కలిసిపోయారనీ, ఇరాన్ ప్రజలకు స్వేచ్ఛ కోసం ఇది గొప్ప అవకాశం అని ట్రంప్ తన పోస్ట్‌లో పేర్కొన్నారు. ఇరాన్ మీడియా మొదట దీనిని ఖండించింది, కానీ తరువాత దానిని ధృవీకరించింది. 1989 నుండి ఇరాన్‌కు నాయకత్వం వహించిన ఖమేనీ మరణం మధ్యప్రాచ్యంలో పెద్ద రాజకీయ మార్పులకు కారణమవుతుందని భావిస్తున్నారు.
 
ఇరాన్ క్షిపణి ప్రదేశాలపై దాడులు కొనసాగుతాయని అమెరికా కూడా హెచ్చరించింది. ఇప్పటికైనా ఇరాన్ తన దేశాన్ని కాపాడుకోవాలని ట్రంప్ వెల్లడించారు.
About Writer
ఐవీఆర్
తర్వాతి కథనం
ఖమేనీని హతమార్చిన అమెరికా - ఇజ్రాయెల్ దళాలు.. తదుపరి ఇరాన్ సుప్రీం ఎవరు?