గురువారం, 26 డిశెంబరు 2024
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. పెరటి వైద్యం
Written By
Last Updated : బుధవారం, 21 నవంబరు 2018 (13:42 IST)

చిలకడ దుంపని పేస్టులా చేసి పాలలో కలుపుకుని తాగితే...

చిలకడ దుంపలు చాలు తియ్యగా, రుచిగా ఉంటాయి. వీటిని పచ్చివిగా తీసుకోవడం కన్నా ఉడికించి తీసుకుంటే దాని రుచి ఇంకా రెట్టింపవుతుంది. వీటిని తీసుకోవడం వలన కలిగే ఆరోగ్య ప్రయోజనాలేంటో చూద్దాం..
 
చిలకడ దుంపల్లో విటమిన్ బి6, సి సమృద్ధిగా ఉన్నాయి. ఇవి చర్మంలోని కణాలను గట్టిగా మారుస్తాయి. చిలకడలోని పోషక విలువలు చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచుతాయి. వీటిని తరుచుగా ఆహారంలో భాగంగా తీసుకుంటే రక్తంలోని గ్లూకోజ్ లెవల్స్ కంట్రోల్లో ఉంటాయి. చిలకడ దుంప శరీర వ్యాధినిరోధక శక్తిని పెంచుటలో మంచి ఔషధం. 
 
గుండె పట్టేయడం, రక్తపోటు వంటి సమస్యలను అడ్డుకునేందుకు చిలకడ దుంపల్లో కొద్దిగా చక్కెర లేదా ఉప్పు కలిపి సేవిస్తే ఫలితం ఉంటుంది. ఈ దుంపల్లోని విటమిన్ సి కంటిచూపుకు చాలా ఉపయోగపడుతుంది. రక్తప్రసరణ సాఫీగా జరిగేలా చేస్తాయి. కడుపు నొప్పిగా ఉన్నప్పుడు చిలకడ దుంపలను మెత్తని పేస్ట్‌లా చేసుకోవాలి. ఈ మిశ్రమాన్ని గ్లాస్ పాలలో కలిపి సేవిస్తే నొప్పి తగ్గుముఖం పడుతుంది. 
 
చిలకడలోని పీచు పదార్థం అజీర్తిని తొలగిస్తుంది. ఇందులోని రసాయనాలు ఇన్‌ఫెక్షన్స్‌ నుండి కాపాడుతాయి. చర్మం దురదలుగా ఉన్నప్పుడు ఈ చిలకడ తొక్కలను పొడిచేసి అందులో కొద్దిగా నిమ్మరసం కలిపి చర్మాని పట్టించాలి. రెండుగంటల పాటు అలానే ఉంచి ఆ తరువాత స్నానం చేయాలి. ప్రతిరోజూ ఇలా చేస్తే దురదలు తొలగిపోయి. చర్మం తాజాగా మారుతుంది.