శుక్రవారం, 27 డిశెంబరు 2024
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. ఆయుర్వేదం
Written By
Last Updated : శుక్రవారం, 9 నవంబరు 2018 (11:55 IST)

పుదీనా ఆకుల నీటితో స్నానం చేస్తే..?

పుదీనా ఆస్తమా వ్యాధికి మంచి ఔషధంగా ఉపయోగపడుతుంది. దీనిలోని విటమిన్స్, యాంటీ ఆక్సిడెంట్స్, మినరల్స్, ప్రోటీన్స్ వంటి ఖనిజాలు కడుపులోని ఇన్‌ఫెక్షన్స్‌ను తగ్గిస్తాయి. పుదీనా ఆకులను టీ లేదా సూప్ రూపంలో తీసుకుంటే జీర్ణవ్యవస్థ మెరుగుపడుతుంది. దీనిని తరచుగా ఆహారంలో భాగంగా చేర్చుకుంటే అనారోగ్య సమస్యలు దరిచేరవని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.
 
జలుబు, దగ్గు లేదా గొంతునొప్పిగా ఉన్నప్పుడు పుదీనా ఆకులను నీటిలో మరిగించుకుని ఆ నీటితో ఆవిరి పీల్చుకుంటే ఈ సమస్యలు తొలగిపోతాయి. అలానే తలనొప్పితో బాధపడేవారు పుదీనా ఆకులను పేస్ట్‌లా చేసుకుని అందులో కొద్దిగా నిమ్మరసం కలిపి నుదుటిపై రాసుకోవాలి. గంట పాటు అలానే ఉంచి ఆ తరువాత శుభ్రం చేసుకుంటే మంచి ఉపశమనం లభిస్తుంది. 
 
చాలామంది బరువు పెరిగిపోతుందని దానిని తగ్గించడానికి రకరకాల మందులు వాడుతుంటారు. అయినా కూడా ఏ మాత్రం తేడా కనిపించలేదని బాధపడుతుంటారు. అందుకు పుదీనా టీ చాలా మంచిది. రోజూ ఉదయాన్నే మీరు ఎలాగో టీ చేసుకుంటారు... కాబట్టి ఆ టీలో కొన్ని పుదీనా ఆకులను వేసి మరి కాసేపు మరిగించి చల్లారిన తరువాత సేవిస్తే బరువు పెరిగే అవకాశాలు చాలా తక్కువగా ఉన్నాయని చెప్తున్నారు. దాంతో పాటు రోజంగా ఎనర్జీగా ఉంటారు. 
 
ఈ చలికాలం వచ్చిదంటే చాలు.. దోమలు కూడా దీనికి తోడుగా వచ్చేస్తుంటాయి. ఈ దోమల వలన రకరకాలు అనారోగ్య సమస్యలకు గురైయ్యే ప్రమాదం ఉందని నిపుణులు చెబుతున్నారు. దాంతో పాటు దోమలు కుట్టినప్పుడు చర్మంపై ఏర్పడే దరుద్దుర్లు ఇన్‌ఫెక్షన్స్‌కు దారితీస్తాయి. దాంతో చర్మమంతా దురదగా ఉంటుంది. అలా ఉన్నప్పుడు పుదీనా ఆకుల నీటిలో స్నానం చేయండి.. మంచి ఉపశమనం లభిస్తుంది.