గురువారం, 26 డిశెంబరు 2024
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. ఆయుర్వేదం
Written By
Last Updated : శుక్రవారం, 2 నవంబరు 2018 (12:50 IST)

కాకరకాయ చేదే.. దాంతో జ్యూస్ చేసి తీసుకుంటే..?

సాధారణంగా అధిక బరువు గలవారు.. నేను ఎక్కువగా తినడం వలనే బరువు పెరిగానంటూ తినడం మానేస్తున్నారు. దాంతో ఇంగా బరువు పెరిగిపోతున్నారు. మళ్లీ ఆలోచనలో పడిపోతారు.. నేను సరిగ్గా తినకపోయినా బరువు పెరిగిపోతున్నానంటూ.. వైద్య చికిత్సలు తీసుకుని వారిచ్చిన మందులు వాడుతుంటారు.. అలా చేయడం మంచిదే.. కానీ, అదే పనిగా మందులు వాడడం కూడా ఆరోగ్యానికి అంత మంచిది కాదు..
 
రోజూ డైట్‌లో కాకరకాయ జ్యూస్ చేర్చుకుంటే మంచి ఫలితాలు లభిస్తాయి. కాకరకాయలోని మినరల్స్, యాంటీ ఆక్సిడెంట్స, ప్రోటీన్స్ వంటి పదార్థాలు.. అధిక బరువును తగ్గించుటకు ఉపయోగపడుతాయి. కాకరకాయ జ్యూస్ ఎలా చేయాలంటే.. కాకరకాయలను చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని అందులో కొద్దిగా ఉప్పు, చక్కెర, మిరియాల పొడి కలిపి జ్యూస్‌లా చేసుకోవాలి. ఆ తరువాత ఈ మిశ్రమాన్ని వడగట్టి తీసుకుంటే బరువు తగ్గుతారని చెప్తున్నారు.
 
అలానే నిమ్మరసంలో కొద్దిగా కొత్తిమీర కలిపి జ్యూస్‌లా చేసుకుని సేవిస్తే బరువు తగ్గుతారు. దాంతో పాటు పొట్ట చుట్టూ పేరుకున్న కొవ్వు కూడా కరిగిపోతుంది. కొత్తిమీరలో క్యాలరీలు తక్కువ కానీ విటమిన్ ఎ, బి, సి, కెలతో పాటు ఐరన్, పొటాషియం వంటి ఖనిజాలు పుష్కలంగా ఉంటాయి. ఇవి శరీరంలోని వ్యర్థ పదార్థాలను బయటకు పంపుటకు సహాయపడుతాయి. 
 
కొత్తిమీరలోని ఎంజైములు జీవక్రియలు బాగా జరిగేలా చేస్తాయి. వీటివలన కూడా బరువు తగ్గుతారు. ఇక నిమ్మకాయ శరీరంలో నీటి నిల్వలను పెంచుతుంది. అందువలన ప్రతిరోజూ ఉదయాన్నే నిమ్మకాయ, కొత్తిమీరతో జ్యూస్ చేసి తీసుకుంటే బరువు తగ్గడంతో పాటు ఉత్సాహంగా ఉంటారని ఆయుర్వేద నిపుణులు సూచిస్తున్నారు.