సోమవారం, 23 డిశెంబరు 2024
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. పెరటి వైద్యం
Written By
Last Updated : సోమవారం, 5 నవంబరు 2018 (13:00 IST)

నారింజ తొక్క పొడి, శొంఠితో చిన్నారులకు ఆ సమస్య రాదు..?

కమలాపండు ఆరోగ్యానికి మంచి ఔషధంగా ఉపయోగపడుతుంది. దీనిలోని విటమిన్స్, యాంటీ ఆక్సిడెంట్స్, ప్రోటీన్స్, మినరల్స్ కంటి చూపును మెరుగుపరచుటకు సహాయపడుతాయి. దీనిలోని ఆరోగ్య ప్రయోజనాలను తెలుసుకుందాం..
 
1. గొంతునొప్పిగా ఉన్నప్పుడు నారింజ తొక్కలను పొడి చేసుకోవాలి. గ్లాస్ పాలల్లో కొద్దిగా నారింజ తొక్క పొడి, చక్కెర కలిపి ప్రతిరోజూ ఉదయాన్నే తీసుకోవాలి. ఇలా చేయడం వలన గొంతునొప్పి తగ్గుతుంది.
 
2. శరీర వేడి అధికంగా ఉన్నవారు.. రోజూ కమలాపండు జ్యూస్ తీసుకుంటే వేడి తగ్గుతుంది. దాంతో పాటు అనారోగ్య సమస్యలు కూడా దరిచేరవని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. 
 
3. తలనొప్పిగా ఉన్నప్పుడు కమలా తొక్క పొడిలో కొద్దిగా ఆలివ్ నూనె కలిపి నుదిటిపై రాసుకోవాలి. గంట పాటు అలానే ఉంచుకుని ఆ తరువాత గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకోవాలి. ఇలా క్రమంగా చేస్తే తలనొప్పి తగ్గుముఖం పడుతుంది. 
 
4. చిగుళ్ల సమస్యతో బాధపడుతున్నవారు.. రోజూ ఉదయాన్నే నారింజ తొక్క పొడితో పళ్లు తోముకుంటే సమస్య పోతుంది. దాంతో పాటు దంతాలు తెల్లగా కూడా మారుతాయి. 
 
5. ఈ చలికాలంలో పిల్లలకు ఆయాసం, జలుబు ఎక్కువగా ఉంటుంది. అలాంటప్పుడు.. నారింజ తొక్కను పొడి చేసుకోవాలి. ఈ పొడిని నీటిలో మరిగించుకుని అందులో కొద్దిగా శొంఠి, అల్లం, పటికబెల్లం వేసి బాగా మరిగించుకోవాలి. 20 నిమిషాల తరువాత ఆ మిశ్రమాన్ని వడగట్టి చల్లారిన తరువాత తీసుకుంటే ఆయాసం, జలుబు వంటి సమస్యలు తొలగిపోతాయి.