సోమవారం, 27 జనవరి 2025
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. ఆయుర్వేదం
Written By
Last Updated : సోమవారం, 22 అక్టోబరు 2018 (15:31 IST)

పాలలో వెన్న కలిపి తీసుకుంటే..?

వెన్న అనగానే నోరూరుతుంది. అంతేకాకుండా వెన్నతో తయారుచేసిన ఆహారాలు చాలా రుచిగా ఉంటాయి. పాల ఉత్పత్తుల్లో ఒకటిగా వెన్నను చెప్పవచ్చును. వెన్నలోని విటమిన్స్ శరీరానికి కావలసిన పోషక విలువలను అందిస్తాయి. కొందరు చిన్న వయస్సులోనే థైరాయిడ్ సమస్యతో బాధపడుతుంటారు. అందుకు వైద్య చికిత్సలు కూడా తీసుకుంటారు. అయినా కూడా ఎటువంటి లాభం ఉండదు.
 
కాబట్టి ఇలా చేస్తే తప్పకుండా ఈ సమస్య తొలగిపోతుంది. అంటే ప్రతిరోజూ వెన్నలో కొద్దిగా చక్కెర కలిపి తీసుకుంటే థైరాయిడ్ సమస్య నుండి వెంటనే ఉపశమనం లభిస్తుంది. వెన్నలోని లినోలిక్ యాసిడ్ క్యాన్సర్ వ్యాధులకు తగ్గిస్తుంది. ఫంగల్ ఇన్ఫెక్షన్స్ నివారణకు వెన్నలోని లూరిక్ యాసిడ్ బాగా పనిచేస్తుంది. చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గించే లెసిథిన్ అనే పదార్థం వెన్నలో ఉంది. 
 
కండరాలు వృద్ధిచెందడానికి, శరీర రోగనిరోధశక్తిని పెంచడానికి వెన్న దివ్యౌషధంగా పనిచేస్తుంది. మహిళకు ప్రతిరోజు వెన్నను తీసుకుంటే సంతానసాఫల్య అవకాశాలు లభిస్తాయని ఆయుర్వేద నిపుణులు సూచిస్తున్నారు. చిన్నారులు ఆరోగ్యంగా ఉండాలంటే రోజూ పాలలో కొద్దిగా వెన్నను కలిపి ఇస్తే ఊబకాయం వంటి సమస్యలు దరిచేరవు. 
 
కల్తీలేని వెన్నలో మంటి బ్యాక్టీరియాలు ఉంటాయి. ఇవి శరీరంలోని చెడు బ్యాక్టీరియాలను తొలగిస్తాయి. దాంతో ఎముకలు, నరాలు బలంగా ఉంటాయి. ప్రతిరోజూ డైట్‌లో వెన్నను చేర్చుకుంటే కీళ్లనొప్పులు తగ్గుముఖం పడుతాయి. మెదడు పనితీరును మెరుగుపరుస్తుంది. గాస్ట్రోఇంటస్టైనల్ ఇన్ఫెక్షన్స్‌ను నివారిస్తుంది. ఆరోగ్యవంతమైన జీవితానికి ఆర్గానికి వెన్న చాలా మంచిది.