సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By
Last Updated : ఆదివారం, 16 డిశెంబరు 2018 (10:21 IST)

మాఫియాతో ఆమెకు లింకులు.. కేరళ నటిపై దుండగుల కాల్పులు

కేరళ నటి లీనా మరియా పాల్‌పై గుర్తుతెలియని దుండగలు కొందరు కాల్పులు జరిపారు. ఈ కాల్పుల నుంచి ఆమె ప్రాణాలతో బయటపడగా, దుండగులు కూడా తప్పించుకుని పారిపోయారు. దీనిపై కేరళ పోలీసులు కేసు నమోదు దర్యాప్తు జరుపుతున్నారు. 
 
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, కొచ్చిలోని పానంపిల్లీలోని నటి బ్యూటీ పార్లర్ వద్ద ఉన్న లీనా పాల్‌‌పై బైక్‌పై వచ్చిన ఇద్దరు గుర్తుతెలియని వ్యక్తులు కాల్పులు జరిపారు. అనంతరం దుండగులు అక్కడి నుంచి పరారయ్యారు. 
 
దుండగులు లోపలికి వెళ్లకుండా బయటి నుంచే కాల్పులు జరపడంతో ఎవరూ గాయపడలేదని పోలీసులు తెలిపారు. అండర్ వరల్డ్‌తో ఆర్థిక పరమైన అంశాల్లో విభేదాలే ఈ ఘటనకు కారణంగా తెలుస్తోందని పేర్కొన్నారు. 
 
బైక్‌పై వచ్చిన దుండగులు ఎయిర్ గన్స్ ఉపయోగించినట్టు పోలీసులు తెలిపారు. పార్లర్ వద్ద, ఆ చుట్టుపక్కల ఉన్న సీసీ టీవీ ఫుటేజీలను పోలీసులు  స్వాధీనం చేసుకున్నారు. ఇదిలావుంటే లీనాపై వివిధ నగరాల్లో చీటింగ్ కేసులు కూడా ఉన్నట్టు పోలీసులు పేర్కొన్నారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.