గురువారం, 23 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. గుసగుసలు
Written By
Last Updated : బుధవారం, 5 డిశెంబరు 2018 (17:07 IST)

ఆర్మీ ఆఫీసర్‌గా జాన్వీ కపూర్.. స్పెషల్ ట్రైనింగ్..

అతిలోకసుందరి శ్రీదేవి కుమార్తె జాన్వీ కపూర్‌కు మంచి అవకాశాలు వెతుక్కుంటూ వస్తున్నాయి. తొలి సినిమా దఢక్‌తోనే గ్లామర్ పరంగా మంచి మార్కులు కొట్టేసిన జాన్వీ.. రెండో సినిమాగా మల్టీస్టారర్‌లో నటించనుంది. అలాగే మూడో సినిమాగా బయోపిక్‌ను ఎంచుకుంది. మహిళా వైమానిక యోధురాలు గుంజన్ సక్సేనా జీవిత చరిత్ర ఆధాకంగా తెరకెకే సినిమాలో జాన్వీ గుంజన్ పాత్రలో కనిపించనుంది. 
 
కార్గిల్ యుద్ధంలో గుంజన్ సక్సేనా చేసిన వీరోచిత విన్యాసాలను కళ్లకు కట్టినట్లు ఈ సినిమాలో చూపించనున్నారు. "శౌర్య వీర చక్ర" అవార్డును అందుకున్న గుంజన్ సక్సేనా బయోపిక్‌లో జాన్వీ నటించేందుకు సిద్ధమవుతోంది.
 
ఇందుకోసం జాన్వీ శిక్షణ తీసుకుంటుందని.. ఇటీవలే గుంజన్ సక్సేనాను జాన్వీ కపూర్ కలుసుకుని ఆమె అనుభవాలను గురించి అడిగి తెలుసుకుందని సమాచారం. ఆర్మీ ఆఫీసర్‌గా జాన్వీ కనిపించనుండటంతో శ్రీదేవి ఫ్యాన్స్ పండగ చేసుకుంటున్నారు.