శుక్రవారం, 27 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By జె
Last Modified: మంగళవారం, 18 డిశెంబరు 2018 (11:08 IST)

ఐతే ఇప్పుడేం చేయమంటావ్... బ్లేడుతో కోసుకోమంటావా... బండ్ల గణేష్(Video)

తెలంగాణా ఎన్నికల్లో టీఆరెస్ గెలిస్తే బ్లేడ్‌తో గొంతు కోసుకుంటానని శపథం చేసి కాంగ్రెస్ ఓటమితో అజ్ఞాతం లోకి వెళ్లిపోయిన బండ్ల గణేష్ తిరుమలలో ప్రత్యక్షం అయ్యాడు. మీడియాను తప్పించుకునేందుకు నానా ఇబ్బంది పడ్డారు. ఐతే మీడియా వదులుతుందా... చుట్టుముట్టేసింది. దీనితో తప్పించుకోలేక మాట్లాడక తప్పింది కాదు.
 
గొంతు గోసుకుంటానన్నారుగా ఓ విలేకరి అడగ్గా... ఐతే ఇప్పుడేం చేయమంటావ్... కోసుకోమంటావా... కోపంలో ఎన్నో అంటారు. మా కార్యకర్తల ఉత్సాహం, కాన్ఫిడెన్స్ కోసం అలా అన్నాను. అది కాస్తా ఓవర్ కాన్ఫిడెన్స్ అయిందంటూ వివరణ ఇచ్చుకున్నారు. ఓటమి బాధతోనే ఇన్ని రోజులు మౌనంగా ఉన్నానని.. ఓవర్ కాన్ఫిడెన్స్‌తోనే అలా అన్నానని.. మాట వరుసకు వంద అంటామని వదిలేయమoటూ మీడియాను దాటుకుని వెళ్ళిపోయాడు బండ్ల. చూడండి వీడియో...