సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. గుసగుసలు
Written By
Last Updated : గురువారం, 20 డిశెంబరు 2018 (09:44 IST)

'వెంకీ మామ'కు హీరోయిన్ ఫిక్స్...

సీనియర్ హీరో వెంకటేష్ మల్టీ స్టారర్ చిత్రాలవైపు మొగ్గు చూపుతున్నారు. గతంలో సూపర్ స్టార్ మహేష్ బాబు (సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు), ఆ తర్వాత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ (గోపాల గోపాల), తాజాగా మెగా ఫ్యామిలీ హీరో వరుణ్ తేజ్‌ (ఎఫ్-2 ఫన్ అండ్ ఫస్ట్రేషన్)లతో కలిసి ఈ తరహా చిత్రాలు చేశాడు. కొత్త సంవత్సరంలో అక్కినేని నాగ చైతన్యతో కలిసి మరో మల్టీస్టారర్ చిత్రంలో నటించనున్నాడు. ప్రస్తుతం ఈ చిత్రం ప్రీప్రొడక్షన్ దశలో ఉంది. వీలైనంత త్వరగా ఈ చిత్రాన్ని సెట్స్‌పైకి తీసుకెళ్లాలని భావిస్తున్నారు. 
 
అయితే, ఈ చిత్రంలో అక్కినేని నాగ చైతన్యకు జోడీగా హీరోయిన్ ఫిక్స్ అయింది. కానీ, వెంకటేష్‌కు మాత్ర హీరోయిన్‌ను ఎంపిక చేయడం దర్శక నిర్మాతలకు కష్టమైంది. వివిధ కోణాల్లో ఆలోచన చేసిన తర్వాత చివరకు సీనియర్ హీరోయిన్ శ్రియ శరణ్‌ పేరును ఖరారు చేసినట్టు సమాచారం.
 
అయితే దీనిపై అధికారిక ప్రకటన వెలువడాల్సివుంది. ఈ చిత్రానికి బాబీ దర్శకత్వం వహించనుండగా, సురేష్ ప్రొడక్షన్, పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ, కోన ఫిలిమ్స్ కార్పొరేషన్‌లు కలిసి సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించనున్నాయి. ఇతర తారాగణం వివరాలను వెల్లడించాల్సివుంది.