సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By
Last Updated : బుధవారం, 19 డిశెంబరు 2018 (15:29 IST)

21న వెన్నుపోటు పాట ఫస్ట్ లుక్ : 'లక్ష్మీస్ ఎన్టీఆర్' డైరెక్టర్ వర్మ

వివాదాస్పద దర్శకుడు రాంగోపాల్ వర్మ తాజాగా నిర్మిస్తున్న చిత్రం "లక్ష్మీస్ ఎన్టీఆర్". ఎన్టీఆర్ జీవితంలోని కొన్ని ముఖ్య సంఘటనల ఆధారంగా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రానికి లక్ష్మీస్ ఎన్టీఆర్ అనే టైటిల్ ఖరారు చేసినప్పటి నుంచే వివాదం చెలరేగింది. 
 
ప్రస్తుతం శరవేగంగా ఈ చిత్ర షూటింగ్ జరుగుతోంది. ఇందులో 'వెన్నుపోటు' పాట ఫస్ట్‌లుక్‌ను డిసెంబర్‌ 21 సాయంత్రం రిలీజ్ చేస్తున్నట్టుగా సోషల్ మీడియా ద్వారా ప్రకటించాడు. అయితే వర్మ రిలీజ్ చేయబోయే పాటే ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. ఫస్ట్‌లుక్‌ పోస్టర్‌తోనే సెన్సేషన్‌ సృష్టించిన వర్మ.. ఇప్పుడు వెన్నుపోటు పోస్టర్‌ను ఏ రేంజ్‌లో డిజైన్‌ చేశాడా అన్నదానిపై సర్వత్రా ఆసక్తి నెలకొంది.