శనివారం, 11 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By శ్రీ
Last Modified: బుధవారం, 19 డిశెంబరు 2018 (10:15 IST)

సైరా తెర పైకి వ‌చ్చేది ఎప్పుడు..?

మెగాస్టార్ చిరంజీవి న‌టిస్తోన్న తాజా చిత్రం సైరా న‌ర‌సింహారెడ్డి. కొణిదెల ప్రొడ‌క్ష‌న్ కంపెనీ బ్యాన‌ర్ పైన రామ్ చ‌ర‌ణ్ ఏమాత్రం రాజీప‌డ‌కుండా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. స్టైలీష్ డైరెక్ట‌ర్ సురేంద‌ర్ రెడ్డి ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతోన్న ఈ చిత్రం రిలీజ్ ఎప్పుడ‌వుతుందా అని మెగా అభిమానులు ఆస‌క్తితో ఎదురు చూస్తున్నారు. స‌మ్మ‌ర్లో రిలీజ్ చేయాల‌నుకున్నారు. షూటింగ్ కంప్లీట్ కాక‌పోవ‌డం వ‌ల‌న స్వాతంత్ర్య దినోత్స కానుక‌గా ఆగ‌ష్టు 15న రిలీజ్ చేయ‌డానికి ప్లాన్ చేస్తున్నారు అని వార్త‌లు వ‌చ్చాయి. 
 
త్వ‌ర‌లోనే చిరు సైరా న‌ర‌సింహారెడ్డి మూవీ రిలీజ్ డేట్ ఎనౌన్స్ చేస్తార‌ని అభిమానులు ఆస‌క్తితో ఎదురుచూస్తున్నారు. ఇప్ప‌టివ‌ర‌కు సైరా టీమ్ ఎనౌన్స్ చేయ‌లేదు కానీ.. తాజా స‌మాచారం ప్ర‌కారం 2019 ద‌స‌రాకి ఈ భారీ చిత్రాన్ని రిలీజ్ చేయ‌డానికి ప్లాన్ చేస్తున్నార‌ని తెలిసింది.  మ‌రి.. ద‌స‌రా క‌న్నా ముందే రిలీజ్ చేస్తారో ఇంకా ఆల‌స్యం చేస్తారో చూడాలి.