గురువారం, 9 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By
Last Modified: మంగళవారం, 18 డిశెంబరు 2018 (17:44 IST)

'భైరవ గీత'లో హీరోయిన్ అందాలను పిండేశారు... ఎక్కడబడితే అక్కడ కెమేరా పెట్టి...

సినిమా అంటే గ్లామర్ అంటారు. గ్లామర్ అంటే ఎక్స్‌పోజింగ్ కాదంటారు. దానికీ దీనికీ మధ్య కంటికి కనబడనంత సన్నటి గీత వుందంటారు. కానీ ఆ గీత ఏదో ఎవ్వరికీ కనబడి చావదు. హీరోయిన్లను మీరు ఎక్స్ పోజింగ్ చేశారు కదా అంటే అది కాదంటారు. అది గ్లామర్ నటన అంటారు. మళ్లీ సన్నటి గీత గురించే చెప్తారు.
 
అసలు విషయానికి వస్తే రాంగోపాల్ వర్మ శిష్యుడు సిద్థార్థ్ భైరవ గీత అనే పేరుతో ఓ సినిమా చేశాడు. ఈ చిత్రాన్ని చూసినవారు పిచ్చెక్కిపోతున్నారట. అందులో హీరోయిన్ అందాలు ఓ రేంజ్ అనేకంటే... ఏం రేంజో అర్థంకాని స్థాయిలో చూపించేశారట. హీరోయిన్ అందాలను చూపించేందుకు పూర్తిగా ఆమె నుంచి అలాంటి నటనను పిండేశారట. 
 
కెమేరాను ఎన్ని యాంగిల్స్ నుంచి తీయాలో అన్ని యాంగిల్స్ నుంచి లాగించేశారట. హీరోయిన్ కూడా బాగా సహకరించడంతో వర్మ శిష్యుడు సిద్ధార్థ్ చాలా కంఫర్టుబుల్‌గా అన్నీ లాగేశాడట. ఐతే చిత్రం చూసినవారు మాత్రం ఇది సిద్ధార్థ్ తీసింది కాదనీ, రాంగోపాల్ వర్మే లాగించేసి వుంటారని అంటున్నారు. సినిమాల్లో కూడా బినామీ సినిమాలు వస్తున్నాయేమోనని మరికొందరు సెటైర్లు వేస్తున్నారు. మొత్తానికి వర్మ చిత్రంపై అలాంటి చర్చ అయితే జరుగుతోంది.