గురువారం, 23 జనవరి 2025
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
Written By
Last Updated : శనివారం, 20 అక్టోబరు 2018 (17:14 IST)

అరెరె ఇదేంటి? కోహ్లీ నకిలీ ఆస్కార్ గెలుచుకున్నాడు..?

టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ తన అభిమానులను ఆటపట్టించాడు. సినిమాలో నటించానంటూ పోస్టు చేశాడు. తాను ఓ సినిమాలో నటిస్తున్నట్లు గత నెలలో కోహ్లీ ట్విటర్‌లో ఓ పోస్టు చేశాడు. దాని పేరు ట్రైలర్‌ అని, నిర్మాత వ్రాన్‌ ప్రొడక్షన్స్‌ అని.. తన స్టిల్‌ ఉన్న ఓ పోస్టర్‌ను గత నెల 20న ట్వీట్‌ చేశారు. అంతే అందరూ తమ అభిమాన క్రికెటర్.. సినిమాల్లో నటిస్తున్నాడా అంటూ ఆశ్చర్యపోయారు. 
 
కానీ ప్రస్తుతం ఓ వీడియోను కోహ్లీ పోస్టు చేశాడు. ఈ ఫేక్ సినిమాకు ప్రస్తుతం నకిలీ ఆస్కార్ గెలిచానని ఓ వీడియోను ట్విట్టర్లో పోస్ట్ చేశాడు. తాను నటించని ట్రైలర్ సినిమాకు వచ్చిన నకిలీ ఆస్కార్ అవార్డ్ ఇదని చెప్పడంతో క్రికెట్ ఫ్యాన్స్ అందరూ నవ్వుకున్నారు. ప్రస్తుతం కోహ్లీ పోస్టు చేసిన 22 సెకన్ల వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.