గురువారం, 23 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By
Last Updated : బుధవారం, 10 అక్టోబరు 2018 (16:33 IST)

కేక.. కోహ్లీ అఖిల్ కలిసిన వేళ.. ఫోటోలు

అన్నపూర్ణ స్టూడియోలో టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ, అక్కినేని అఖిల్ కలిసి సరదాగా మాచ్చటిస్తున్న ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.

అన్నపూర్ణ స్టూడియోలో టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ, అక్కినేని అఖిల్ కలిసి సరదాగా మాచ్చటిస్తున్న ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. శుక్రవారం నుంచి రెండో టెస్టు ఉప్పల్ స్టేడియంలో ప్రారంభం కానుంది. రెండో టెస్టు కోసం టీమ్‌ ఇండియా, వెస్టిండీస్‌ జట్లు నిన్న హైదరాబాద్‌ చేరుకున్నాయి. 
 
ఇదే టెస్టు మ్యాచ్ కోసం కోహ్లీ తన సతీమణి, బాలీవుడ్ నటి అనుష్క శర్మతో కలిసి హైదరాబాద్‌ వచ్చారు.  ఈ నేపథ్యంలో కోహ్లీ అన్నపూర్ణ స్టూడియోస్‌కు వెళ్లారు. ఈ స్టూడియోస్‌లో ఆయనపై ఓ ప్రకటనను చిత్రీకరించనున్నట్లు సినీ వర్గాలు సోషల్‌మీడియా ద్వారా వెల్లడించాయి. ఇందుకోసమే కోహ్లీ అన్నపూర్ణ స్టూడియోకు వచ్చారని టాక్. 
 
అలాగే అనుష్క శర్మ చేతిలో సినిమాలేవీ లేకపోవడంతో భర్తతో కలిసి మ్యాచ్‌ను చూసేందుకు హైదరాబాద్ వచ్చారు. అనుష్క నటించిన ‘జీరో’ చిత్రం నవంబర్‌లో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.


షారుక్‌ ఖాన్‌ ప్రధాన పాత్రలో నటించిన ఈ చిత్రంలో కత్రినా కైఫ్‌ మరో కథానాయికగా నటించారు. ఆనంద్‌ ఎల్.రాయ్‌ ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు.