సోమవారం, 27 జనవరి 2025
  1. క్రీడలు
  2. ఇతర క్రీడలు
  3. వార్తలు
Written By
Last Updated : మంగళవారం, 9 అక్టోబరు 2018 (14:19 IST)

దినేష్ కార్తీక్- దీపికా పల్లికాల్ న్యూయార్క్ ట్రిప్.. వైరల్ అవుతున్న ఫోటోలు

బ్యాడ్మింటన్ స్టార్స్ సైనా నెహ్వాల్- పారుపల్లి కశ్యప్ త్వరలో పెళ్లి చేసుకోబోతున్న సంగతి తెలిసిందే. తాజాగా మరో స్పోర్ట్స్ లవ్ కపుల్ న్యూయార్క్‌లో సందడి చేశారు.

బ్యాడ్మింటన్ స్టార్స్ సైనా నెహ్వాల్- పారుపల్లి కశ్యప్ త్వరలో పెళ్లి చేసుకోబోతున్న సంగతి తెలిసిందే. తాజాగా మరో స్పోర్ట్స్ లవ్ కపుల్ న్యూయార్క్‌లో సందడి చేశారు. వారు ఎవరంటే..? దినేష్ కార్తీక్- దీపికా పల్లికల్. సెలెబ్రిటీస్ కపుల్స్‌లో ముందుండే ఈ జంట.. న్యూయార్క్‌కు ట్రిప్పేసింది. 
 
ఎప్పుడూ టేబుల్ టెన్నిస్ టోర్నీలు ఆడటం కోసం ప్రొఫెషనల్ ప్లేయర్‌గా మాత్రమే న్యూయార్క్ సిటీలో పర్యటించిన దీపికా తొలిసారిగా భర్త దినేష్‌తో కలిసి వెళ్లింది. అలాగే ప్రస్తుతం టీమిండియా టెస్టు జట్టులో స్థానం లేకపోవడంతో దినేష్ కార్తీక్ కూడా తన భార్యతో కలిసి న్యూయార్క్ నగరానికి వెళ్లాడు. ఇద్దరూ కలిసి సిటీ ఆఫ్ డ్రీమ్స్‌గా పేరున్న న్యూయార్క్‌ నగర వీధుల్లో చక్కర్లు కొట్టారు.
 
సిటీ ఆఫ్ డ్రీమ్స్‌లో తన కల నెరవేరిందని దీపికా పల్లికల్ ఇన్‌స్టాగ్రామ్‌లో తన సంతోషాన్ని షేర్ చేసుకుంది. న్యూయార్క్ టూర్‌లో భర్త దినేష్‌తో కలిసి దిగిన ఫోటోలను పోస్ట్ చేసింది. స్పోర్ట్స్ ట్రిప్‌లా కాకుండా భర్తతో కలిసి న్యూయార్క్ వచ్చానని.. ఈ టూర్ తనకెంతో ప్రత్యేకమని చెప్పింది. ప్రస్తుతం దీపికా పల్లికాల్ షేర్ చేసిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.