మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. ఆధ్యాత్మికం
  2. ఆధ్యాత్మికం వార్తలు
  3. కథనాలు
Written By
Last Updated : శనివారం, 6 అక్టోబరు 2018 (11:51 IST)

కార్తీక మాసంలో తులసి కోటను నాటితే..?

తులసి ఆకులు శ్రీ విష్ణువుకు చాలా ప్రీతికరమైనవి. తులసి చెట్టు లేని ఇళ్లు వుండదంటే అతిశయోక్తి కాదు. ప్రతి ఇంట్లో తప్పనిసరిగా తులసి చెట్టు ఉంటుంది. కనుక ప్రతిరోజూ సూర్యోదయానికి ముందుగా లేచి స్నానమాచరించి ఈ మంత్రాన్ని జపిస్తే సిరిసంపదలు, సకల సౌభాగ్యాలు చేకూరుతాయని విశ్వాసం. 
  
 
''తులసీ దళ లక్షేణ కార్తికే యోర్చయేద్దరిం
పత్రేపత్రే మునిశ్రేష్ఠ మౌక్తికం ఫలమశ్నుతే''
 
అనే ఈ మంత్రాన్ని స్మరిస్తూ శ్రీ మహా విష్ణువుని తులసి ఆకులతో పూజించాలి. అలానే తులసి చెట్టును ప్రదక్షణలు చేయాలి. ఇలా ప్రతిరోజూ చేస్తుంటే దీర్ఘసుమంగళీగా ఉంటారని పురాణాలలో చెబుతున్నారు. కార్తీక మాసంలో ఇంటిముంగిట తులసి కోటను ఏర్పాటు చేసుకుని దానికి పూజలు, అభిషేకాలు చేస్తే సకలసంపదలు చేకూరుతాయని విశ్వాసం.