శుక్రవారం, 24 జనవరి 2025
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. ఆయుర్వేదం
Written By selvi
Last Updated : శుక్రవారం, 28 సెప్టెంబరు 2018 (18:12 IST)

వేపాకు చెట్టు కింద హాయిగా పగటిపూట కునుకు తీస్తే?

వేప ఆకులు, పువ్వు, పండు, బెరడులో దివ్యౌషధాలు దాగివున్నాయి. వేపాకు సర్వరోగ నివారిణి. పళ్లు తోముకునే పుల్ల నుంచి సౌందర్య సాధనాలు, ఔషధాల తయారీ వరకు వేపాకు చాలా సహాయపడుతుంది. వేపాకుల్లో, పువ్వుల్లో ఉండే న

వేప ఆకులు, పువ్వు, పండు, బెరడులో దివ్యౌషధాలు దాగివున్నాయి. వేపాకు సర్వరోగ నివారిణి. పళ్లు తోముకునే పుల్ల నుంచి సౌందర్య సాధనాలు, ఔషధాల తయారీ వరకు వేపాకు చాలా సహాయపడుతుంది. వేపాకుల్లో, పువ్వుల్లో ఉండే నింబోలైడ్ అనే రసాయనం పలు రకాల క్యాన్సర్ వ్యాధులనుండి ఉపశమనం కలిగిస్తుంది.


బ్యాక్టీరియా, ఫంగస్ నివారణకు వేపాకు దివ్యౌషధంగా పనిచేస్తుందని ఆయుర్వేద నిపుణులు సూచిస్తున్నారు. చర్మ సంబంధ వ్యాధుల్ని తరిమికొట్టేందుకు చక్కటి ఔషధంగా పనిచేస్తుంది. 
 
తాజా సర్వేలో పగటిపూట వేపచెట్టు కింద నిద్రించినవాళ్లు ఆరోగ్యంగా ఎక్కువకాలం జీవిస్తారని తేలింది. వేపాకు దోమల నివారిణిగా పనిచేస్తుంది. వేపాకును కాల్చినట్లైతే ఆ పొగకు ఇంట్లోని దోమలు నశిస్తాయి. చర్మంపై ఇన్ఫెక్షన్లను దూరం చేసుకోవాలంటే.. వేపనూనెను వాడితే మంచి ఫలితం వుంటుంది. ముఖంపై ఉండే మొటిమల్ని వేపనూనెను ఉపయోగించి పోగొట్టవచ్చు. 
 
వేపాకు రసంతో జుట్టులో ఉండే చుండ్రును పోగొట్టవచ్చు. కురులు పెరగటానికి, బలంగా ఉండేందుకు, చర్మ సౌందర్యానికి వేపనూనె ఉపయోగిస్తారు. వేపలో వుండే యాంటీ ఆక్సిడెంట్స్ వాతావరణ కాలుష్యం నుంచి ఏర్పడే ఇన్ఫెక్షన్లను దరిచేరనివ్వదని ఆయుర్వేద నిపుణులు సూచిస్తున్నారు.