శనివారం, 11 జనవరి 2025
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. చిట్కాలు
Written By Kowsalya
Last Updated : శనివారం, 22 సెప్టెంబరు 2018 (11:34 IST)

ప్రతిరోజూ జామపండు తీసుకుంటే.. మధుమేహా వ్యాధి..?

వర్షాకాలంలో ఆరోగ్యాన్ని పెంచేందుకు జామపండు మంచిగా ఉపయోగపడుతుంది. జామపండులో విటమిన్స్, ప్రోటీన్స్ వంటి ఖనిజాలు పుష్కలంగా ఉన్నాయి. జామపండులో పీచు పదార్థం అధికంగా ఉంటుంది. ఈ పీచు పదార్థం చెడు కొలెస్ట్రాల

వర్షాకాలంలో ఆరోగ్యాన్ని పెంచేందుకు జామపండు మంచిగా ఉపయోగపడుతుంది. జామపండులో విటమిన్స్, ప్రోటీన్స్ వంటి ఖనిజాలు పుష్కలంగా ఉన్నాయి. జామపండులో పీచు పదార్థం అధికంగా ఉంటుంది. ఈ పీచు పదార్థం చెడు కొలెస్ట్రాల్, హైబీపీ వంటి సమస్యల నుండి కాపాడుతుంది. అధిక బరువును తగ్గించుటకు ఎంతో దోహదపడుతుంది.
 
జామపండులోని కార్బోహైడ్రేట్స్ జీర్ణశక్తిని పెంచుటకు సహాయపడుతాయి. ప్రతిరోజూ ఒక జామపండును తీసుకుంటే డయాబెటిస్, క్యాన్సర్ వంటి వ్యాధులు దరిచేరవు. అల్జిమర్స్ వ్యాధిని నివారిస్తుంది. కంటి శుక్లాలు, కీళ్లవాపులు వంటి సమస్యలను తొలగిస్తుంది. ఈ పండులోని విటమిన్ ఏ, సీ శరీరో రోగనిరోధకశక్తిని పెంచుతాయి. 
 
జామపండు రక్తంలోని గ్లూకోజ్ లెవల్స్‌ను తగ్గించుస్తుంది. దంతాలు, గొంతు నొప్పి, చిగుళ్ల వ్యాధులు రాకుండా కాపాడుతుంది. నోటి దుర్వాసను తొలగించుటకు చక్కగా పనిచేస్తుంది. జామపండు జ్యూస్ కాలేయానికి టానిక్‌లా ఉపయోగపడుతుంది. ఎముకల బలానికి మంచిది. గర్భిణులు జామపండు తీసుకుంటే ఆరోగ్యానికి చాలా మంచిది.