1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. చిట్కాలు
  4. health benefits of ginger tea

అల్లం 'టీ' తీసుకుంటే అధిక బరువు తగ్గుతారా..?

అధిక బరువు తగ్గాలనుకునే వారు కేవలం వ్యాయామం మాత్రం చేస్తే సరిపోదు. క్యాలరీలు ఎక్కువగా ఉండే ఆహార పదార్థాలను తీసుకోకూడదు. ఈ పదార్థాలను తినడం మానేస్తే బరువు తగ్గే అవకాశలున్నాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్న

ginger
అధిక బరువు తగ్గాలనుకునే వారు కేవలం వ్యాయామం మాత్రం చేస్తే సరిపోదు. క్యాలరీలు ఎక్కువగా ఉండే ఆహార పదార్థాలను తీసుకోకూడదు. ఈ పదార్థాలను తినడం మానేస్తే బరువు తగ్గే అవకాశలున్నాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. అలానే చక్కెర అధికంగా ఉండే పండ్ల రసాలు, శీతలపానీయాలు, చిప్స్, నూనె పదార్థాలు అస్సలు తినరాదు.
 
ప్రతిరోజూ ఉదయాన్నే అల్లంతో తయారుచేసిన టీని తీసుకోవడం వలన కూడా అధిక బరువు తగ్గుతారు. మరి ఈ అల్లం టీని ఎలా చేయాలో తెలుసుకుందాం. ఒక పాత్రలో నీటిని తీసుకుని అందులో కొద్దిగా అల్లం తురుము వేసుకుని బాగా మరిగించుకోవాలి. కాసేపటి తరువాత ఆ నీటిని వడగట్టి క్రమం తప్పకుండా తీసుకోవాలి. 
 
దాంతో అధిక బరువు తగ్గుతుంది. అదే అల్లం టీలో కొద్దిగా నిమ్మరసం లేదా తేనెను కలుపుకుని తీసుకుంటే కూడా మంచి ఉపశమనం లభిస్తుంది. శరీర రోగనిరోధశక్తిని పెంచుటకు అల్లం టీ దివ్యౌషధంగా పనిచేస్తుంది. 
About Writer
Kowsalya
దేవీ (మురళీకృష్ణ)  నిక్‌నేమ్- శక్తిమాన్ సినిమా రంగంలో దాదాపు 26 ఏళ్ల అనుభవం ఉంది. కళారంగంపై ఇంట్రెస్టుతో రిపోర్టర్‌గా కెరీర్ మొదలైంది. అలా చేస్తూనే విజయవాడలో రంగస్థలంపై నాటకాల్లో పాత్రలు పోషించారు. అలా ఆర్టిస్టుగా.. పలు సినిమాలు, సీరియల్స్‌లో సైతం నటించారు. స్క్రిప్ట్ వర్క్‌లో కూడా కొద్దికాలం చేశారు. అలా ప్రజాశక్తి దినపత్రికలో సినిమా పేజీ న్యూస్ రిపోర్టర్‌గా తనతోనే ఆరంభం అయింది. అలా చేస్తుండగానే మెగాస్టార్ చిరంజీవి గారితో ఇంటర్వ్యూ చేశాక...... మరింత చదవండి
తర్వాతి కథనం
చక్కనైన నడుము కోసం కష్టమైన ఎక్సర్‌సైజులు అవసరంలేదు...