శుక్రవారం, 29 మార్చి 2024
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. చిట్కాలు
Written By chj
Last Modified: మంగళవారం, 18 సెప్టెంబరు 2018 (21:50 IST)

చక్కనైన నడుము కోసం కష్టమైన ఎక్సర్‌సైజులు అవసరంలేదు...

నడుమెక్కడ నీకు నవలామణీ.... అన్నట్లుగా నడుమనేది స్త్రీలకు ఉండీ ఉండనట్లుగా, పొందికగా, నాజూగ్గా సన్నగా ఉంటేనే అందమూ అని స్త్రీ గ్రహించాలి. చక్కనైన నడుము కోసం కష్టమైన ఎక్సర్‌సైజులు చేయాల్సిన పని లేదు. చక్కగా కొన్ని చిట్కాలు, సలహాలు పాటిస్తే చాలు. అవేంటో

నడుమెక్కడ నీకు నవలామణీ.... అన్నట్లుగా నడుమనేది స్త్రీలకు ఉండీ ఉండనట్లుగా, పొందికగా, నాజూగ్గా సన్నగా ఉంటేనే అందమూ అని స్త్రీ గ్రహించాలి. చక్కనైన నడుము కోసం కష్టమైన ఎక్సర్‌సైజులు చేయాల్సిన పని లేదు. చక్కగా కొన్ని చిట్కాలు, సలహాలు పాటిస్తే చాలు. అవేంటో తెలుసుకుందాం.
 
1. స్త్రీలలో నడుము లావెక్కడానికి ముఖ్య కారణం ఆ ప్రదేశంలో పరిమితికి మించి కొవ్వు పేరుకుపోవడమే. ఆవిధముగా నడుము వద్ద ముడతలు పడే అవకాశము ఉంది.
 
2. సాధారణంగా వివాహం జరిగిన స్త్రీలల్లో నడుము లావెక్కి పోవడం జరుగుతుంది. దానికి కారణం తగిన శ్రద్ద తీసుకోకపోవడం ఒక కారణమైతే తగినంత పని లేకుండా పొద్దస్తమానం ఊరికే కూర్చోవడం కూడా ఒక కారణంగా చెప్పవచ్చు. 
 
3. నడుము వద్ద లావు తగ్గడానికి స్త్రీలు తమ ఆహారంలో కొవ్వు పదార్దాలు తగ్గించి ఆకుకూరలు, కాయగూరలు, పండ్లు, పానీయాలు అధికంగా తీసుకోవాల్సి  ఉంటుంది. 
 
4. కాఫీ, టీ, కూల్ డ్రింక్స్ మున్నగు వాటిని తగ్గించాలి. ప్రతిరోజు కాస్తయినా తేలికపాటి వ్యాయామం చేస్తుండాలి.
 
5. నడుము నుండి చేతులను నేలకు ఆనేటట్లుగా ప్రతిరోజు 20 సార్లు చేయాలి. దీనితో పాటు గుంజిళ్లు ప్రతిరోజు ఉదయం 15 నుండి 20 తీయాలి.
 
6. సరైన ఆహారం తగినంత వ్యాయామం ఉంటే ఏ స్త్రీ అయినా తన నడుమును నాజూగ్గా అందంగా ఉంచుకోగలదనడంలో సందేహం లేదు.