మంగళవారం, 23 ఏప్రియల్ 2024
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. చిట్కాలు
Written By Kowsalya
Last Updated : శుక్రవారం, 24 ఆగస్టు 2018 (10:27 IST)

హైబీపీకి కారణమైయ్యే ఆహార పదార్థాలు ఇవే...

హైబీపీ ఉండడం వలన గుండె సంబంధిత వ్యాధులు వస్తాయి. అంతేకాకుండా గుండె ఎటాక్‌లు సంభవిస్తాయి. కనుక ఎవరైతే హైబీపీలో బాధపడుతున్నారో వారు ఈ జాగ్రత్తలు తీసుకోవలసి ఉంటుంది. ఇక హైబీపీ లేనివారు అటువంటి సమస్యలు రా

హైబీపీ ఉండడం వలన గుండె సంబంధిత వ్యాధులు వస్తాయి. అంతేకాకుండా గుండె ఎటాక్‌లు సంభవిస్తాయి. కనుక ఎవరైతే హైబీపీలో బాధపడుతున్నారో వారు ఈ జాగ్రత్తలు తీసుకోవలసి ఉంటుంది. ఇక హైబీపీ లేనివారు అటువంటి సమస్యలు రాకుండా ఉండేందుకు కొన్ని జాగ్రత్తలు తీసుకోవలసి ఉంటుంది. ప్యాక్ చేసిన ఆహార పదార్థాలు తినరాదు. ఇవి రక్తంలో సోడియం పరిమాణాన్ని పెంచుతాయి. దీని వలన హైబీపీ వస్తుంది.
 
కొవ్వు అధికంగా ఉండే ఆహారాలను తీసుకోవడం వలన శరీరంలో చెడు కొలెస్ట్రాల్ పెరుగుతుంది. తద్వారా రక్తనాళాలు గట్టిగా మారుతాయి. దీని ఫలితంగా హైబీపీ వస్తుంది. కావున ప్రతిరోజూ పండ్లు, ఆకుకూరలు, కూరగాయలు తీసుకోవలసి ఉంటుంది. వీటిని తీసుకోవడం వలన గుండె ఆరోగ్యంగా ఉంటుంది. హైబీపీ వంటి సమస్యలు దరిచేరవు.
 
ముఖ్యంగా మద్యం సేవించే వారిలో బీపీ అధికంగా పెరుగుతుంది. కాఫీను తక్కువగా తాగడం లేదా దాన్ని పూర్తిగా మానేయడం వలన హైబీపీ వంటి వ్యాధులు ఉండవు. పాలతో తయార చేసే చీజ్‌లో రుచికోసం ఉప్పు అధికంగా వేస్తారు. తద్వారా శరీరంలో సోడియం పెరిగిపోయి హైబీపీ వస్తుంది. చక్కెర అధికంగా ఉండే ఆహార పదార్థాలను తినరాదు. ఇవి స్థూలకాయం, డయాబెటిస్ వంటి వ్యాధులు ఏర్పడుతాయి.