బుధవారం, 8 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By pnr
Last Updated : మంగళవారం, 18 సెప్టెంబరు 2018 (11:20 IST)

చిన్నపాటి రొమాంటిక్ మూడ్ సన్నివేశంతో కట్ చేసిన 'హలో గురు ప్రేమకోసమే'...

టాలీవుడ్ యువ హీరో రామ్ నటిస్తున్న తాజా చిత్రం హలో గురు ప్రేమకోసమే. ఈ చిత్రంలో అనుపమా పరమేశ్వరన్ హీరోయిన్‌గా నటిస్తోంది. దిల్ రాజు నిర్మిస్తున్న ఈ చిత్రానికి త్రినాథరావు నక్కిన దర్శకత్వం వహిస్తున్నారు.

టాలీవుడ్ యువ హీరో రామ్ నటిస్తున్న తాజా చిత్రం హలో గురు ప్రేమకోసమే. ఈ చిత్రంలో అనుపమా పరమేశ్వరన్ హీరోయిన్‌గా నటిస్తోంది. దిల్ రాజు నిర్మిస్తున్న ఈ చిత్రానికి త్రినాథరావు నక్కిన దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రానికి సంబంధించిన ట్రైలర్‌ను తాజాగా రిలీజ్ చేశారు. మొత్తం 39 సెకన్ల నిడివి కలిగిన ఈ వీడియోలో అనుపమ పరమేశ్వరన్ ఫస్ట్ టైమ్ హాట్‌గా టెంప్టింగ్ అనిపించే లుక్‌లో అదరగొట్టేసింది.
 
రామ్ వళ్ళు విరుస్తూ.. హాల్లోకి రావడం.. అప్పుడే తల స్నానం చేసి వచ్చి.. హాల్లో అటు తిరిగి జుట్టుకు సామ్రాణి వేసుకోవడం.. చూశావా అని అనుపమ అడగడం.. రామ్ సైలెంట్‌గా ఆమె నడుమువైపు చూస్తూ తల ఊపడం.. ఎలా ఉంది అని అడిగితే.. చాల హాట్‌గా ఉందని నిదానంగా చెప్పగా.. కాఫీ అని అనుపమ చెప్పడంతో రామ్ కాఫీని తీసుకుంటాడు. చిన్న రొమాంటిక్ మూడ్ సన్నివేశంతో కూడిన టీజర్‌ను అంతే రొమాంటిక్ బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్‌తో ప్లే కావడంతో యూత్‌కు బాగా కనెక్ట్ అయింది. దేవీశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తుండగా, మరో హీరోయిన్‌గా ప్రణతి నటిస్తోంది. ఈ చిత్రం వచ్చే నెల 18వ తేదీన ప్రేక్షకుల ముందుకురానుంది.