మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By
Last Updated : శనివారం, 6 అక్టోబరు 2018 (14:48 IST)

మరదలా నేను చనిపోతున్నా.. బావా నేను నీతోనే వస్తా... ప్రేమికులు ఆత్మహత్య

తమిళనాడు జిల్లాలో ఓ యువ ప్రేమజంట ఆత్మహత్య చేసుకుంది. అటు పెద్దవారిని ఎదిరించలేక ఇటు తమ విడిపోయి జీవించలకే ఇద్దరూ కలిసి తనవు చాలించింది. ఇంతకీ వారిద్దరూ బావామరదళ్లు కావడం గమనార్హం. తమిళనాడు రాష్ట్రంలోని కృష్ణగిరి జిల్లా డెంగణీకోటకు సమీపంలోని సావరబెత్తంలో జరిగిన ఈ విషాదకర ఘటన వివరాలను పరిశీలిస్తే...
 
సావరబెత్తం గ్రామానికి చెందిన హనుమప్ప అనే వ్యక్తి కుమారుడు హేమంత్‌ (25). పదో తరగతి వరకు చదువుకున్నాడు. ఆ తర్వాత చదువుపై ఇష్టం లేక వ్యవసాయం చేసుకుంటూ జీవిస్తున్నాడు. ఇతని ఇంటికి ఎదురుగా అత్త కుమార్తె  చూడమ్మ(21) నివశిస్తోంది. ఈమె డిగ్రీ పూర్తి చేసి ఇంటిపట్టునే ఉంది. ఈ క్రమంలో చూడమ్మ - హేమంత్‌లు ఒకరినొకరు ఇష్టపడి ప్రేమించుకున్నారు. 
 
అయితే ఈ విషయం వారి తల్లితండ్రులు తెలియదు. చిన్నప్పటినుంచి పెద్దల చాటున పెరిగిన పిల్లలు కావడంతో తమ ప్రేమ విషయాన్ని తల్లిదండ్రులకు చెప్పేందుకు జంకారు. ఒకవేళ పెద్దలకు విషయాన్ని చెబితే తమ పెళ్లికి అంగీకరిస్తారో లేదో అనే బెంగతో ఉండేవారు. ఈక్రమంలో ఇద్దరూ చెట్టుకు ఉరివేసుకున్న స్థితిలో విగతజీవులుగా మారారు. ఈ విషయాన్ని స్థానికులు గుర్తించి పోలీసులకు సమాచారం చేరవేశారు.