గురువారం, 9 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. గుసగుసలు
Written By జె
Last Modified: సోమవారం, 26 నవంబరు 2018 (10:19 IST)

సినిమాలకు తలైవా గుడ్ బై.. ఎందుకు..?

కోలీవుడ్లో రజినీకాంత్‌పై తీవ్రస్థాయిలో చర్చ జరుగుతోంది. రజినీకాంత్ అటు రాజకీయాల్లోకి వెళ్ళేందుకు సినిమాలకు గుడ్ బై చెప్పనున్నట్లు ఎప్పటి నుంచో ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో రజినీకాంత్ ఒక నిర్ణయం తీసేసుకున్నారట. వచ్చే సంవత్సరం నుంచి సినిమాల్లో నటించకూడదని, సినిమాలకు దూరంగా ఉండాలన్న నిర్ణయానికి వచ్చేశారట. అందుకే 2.0 సినిమాను ఈ నెలలో 29వ తేదీన రిలీజ్ అయ్యే విధంగా దర్శకుడు శంకర్‌ని తొందరపెట్టారట. 
 
అంతేకాదు సిమ్రాన్‌తో కలిసి రజినీకాంత్ పేట్ట అనే సినిమాను పూర్తి చేశాడు. షూటింగ్ ఇప్పటికే పూర్తయ్యింది. పేట్ట సినిమా జనవరి 24వ తేదీన విడుదలవుతోంది. 40 రోజుల వ్యవధిలోనే రజినీ రెండు సినిమాలు విడుదల కాబోతున్నాయి. తక్కువ సమయంలోనే రెండు సినిమాలను రిలీజ్ చేయడానికి రజినీకాంత్ సిద్ధమవుతుండటంతో అభిమానుల్లో సంతోషం వ్యక్తమవుతోంది.
 
గత కొంతకాలంగా రజినీకాంత్ సినిమాలు పెద్దగా ఆడలేదు. కబాలి, కాల సినిమాలు పెద్దగా ఆడలేదు. అలాంటి సమయంలో 2.0 సినిమా విడుదలవుతోంది. సినిమా హైప్‌కు తగ్గట్టుగానే విజయం వరిస్తుందనేది రజినీకాంత్ ఆలోచన. అందుకే సినిమా విజయవంతమై సక్సెస్ హీరోగా మళ్లీ పుంజుకుని సినిమాలకు దూరమైపోవాలన్నది రజినీ ఆలోచన. అంతేకాదు ఆ తరువాత రాజకీయాల్లోకి వెళ్ళి ప్రజా సేవ చేయాలన్న నిర్ణయంలో ఉన్నారట రజినీ. మరి చూడాలి రజినీ తీసుకుంటున్న నిర్ణయానికి అభిమానులు ఎంతవరకు సపోర్ట్ చేస్తారో.