శనివారం, 11 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By
Last Updated : శనివారం, 24 నవంబరు 2018 (13:28 IST)

'2.O' చిన్నపిల్లల చిత్రం - 'భైరవగీత' పెద్దల చిత్రం : రాంగోపాల్ వర్మ

సినీ ఇండస్ట్రీలో వివాదాలు సృష్టించడంలో మొదటి స్థానంలో ఉండే దర్శకుడు రాంగోపాల్ వర్మ తాజాగా తమిళ సూపర్ స్టార్ రజినీకాంత్ నటించిన "2.O" చిత్రంపై వ్యంగ్యాస్త్రాలు సంధించాడు. అది చిన్నపిల్లల కోసం తీసిన చిత్రమన్నారు. శంకర్ దర్శకత్వంలో రజినీకాంత్ - అక్షయ్ కుమార్‌లు నటించిన ఈ చిత్రం ఈనెల 29వ తేదీన విడుదలకానుంది. రూ.550 కోట్ల భారీ బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ చిత్రం కోసం చిన్నాపెద్దా అనే తేడా లేకుండా ప్రతి ఒక్కరూ ఎదురు చూస్తున్నారు. 
 
ఈ నేపథ్యంలో రాంగోపాల్ వర్మ ఈ చిత్రంపై వివాదాస్పద కామెంట్స్ చేశారు. దర్శకుడు శంకర్ ఆలోచిస్తున్న ఫోటో, భైరవగీత డైరెక్టర్ సిద్థార్ధ మైక్‌లో యాక్షన్ చెప్తున్న ఫోటోలు పక్క పక్కన పెట్టి, '2.O', ఒక చాలా పెద్ద డైరెక్టర్, చిన్న పిల్లలకోసం తీసిన సినిమా, భైరవగీత, ఒక చిన్న పిల్లోడు, పెద్దవాళ్ళకోసం తీసిన సినిమా.. అని కామెంట్ చేశాడు. 
 
దర్శకుడు ఎస్.ఎస్. రాజమౌళి కన్నా ముందే సౌత్ సినిమా స్టామినా ఏంటో ప్రపంచానికి చాటిచెప్పిన ఘనత శంకర్‌ది. '2.O' కోసం ప్రపంచ సినీ ప్రేక్షకులు ఎంతగా ఎదురు చూస్తున్నారో తెలిసిందే. అలాంటి శంకర్‌ని, గట్టిగా ఒక్క సినిమా అనుభవం కూడా లేని సిద్ధార్థకి పోలిక పెట్టడం ఏంటో ఆయనకే తెలియాలి. వర్మ సమర్పిస్తున్న 'భైరవగీత', '2.O' రిలీజ్ అయిన తర్వాత మరుసటి రోజే విడుదలకానుంది.