అవును.. యువీ బ్యాటింగ్ ఆర్డర్‌ను అందుకే మార్పించా: ధోనీ

ms dhoni
Last Updated: శుక్రవారం, 23 నవంబరు 2018 (17:53 IST)
టీమిండియా 2011లో వన్డే ప్రపంచ కప్‌ను ముద్దాడిన సంగతి తెలిసిందే. సొంతగడ్డపై ప్రపంచ కప్ కొట్టిన తరుణాన్ని అప్పటి కెప్టెన్ ధోనీ గుర్తు చేశారు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో యువరాజ్ సింగ్ ఆ జట్టులోకి రావాల్సిన స్థానానికి తాను రావడంపై ధోనీ క్లారిటీ ఇచ్చాడు. 2011 వన్డే ప్రపంచ కప్ ఫైనల్‌లో యువరాజ్ సింగ్ బ్యాటింగ్ ఆర్డర్ మార్పు అనేది అప్పటికప్పుడు తీసుకున్న నిర్ణయమని చెప్పాడు. 
 
బౌలర్లలో చాలామంది చెన్నై సూపర్ కింగ్స్ కోసం ఐపీఎల్‌లో బౌలింగ్ చేసినవారే. ఆ అనుభవంతో ధీటుగా ఎదుర్కోవచ్చుననే ఆలోచనతో.. మేనెజ్‌మెంట్‌కు చెప్పి యువరాజ్ బ్యాటింగ్ ఆర్డర్‌లో మార్పు చేయమన్నానని.. అందుకు వారు కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని చెప్పాడు. 
 
లంకేయులతో ఐపీఎల్ ఆడిన అనుభవాన్ని పెట్టే బ్యాటింగ్ ఆర్డర్‌లో మార్పు చేశానని చెప్పాడు. శ్రీలంకతో జరిగిన వన్డే ప్రపంచ కప్‌ ఫైనల్లో ధోనీ ఫినిషింగ్ షాట్ కొట్టి 3 దశాబ్ధాల తర్వాత భారత్‌కు వరల్డ్ కప్ అందించిన సంగతి తెలిసిందే.దీనిపై మరింత చదవండి :