సోమవారం, 23 డిశెంబరు 2024
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
Written By
Last Updated : గురువారం, 22 నవంబరు 2018 (15:10 IST)

నువ్వు నన్ను అడుగుతున్నావా.. లేకుంటే చెప్తున్నావా-ధోనీ

మాజీ భారత కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ తనతో సెల్ఫీ దిగిన అభిమానితో సెటైర్లు విసిరాడు. కెప్టెన్‌ పదవి నుంచి తొలగినప్పటికీ.. ఫ్యాన్స్‌ను ఏమాత్రం తగ్గించుకోవట్లేదు. తాజాగా సింగర్ రాహుల్ వైద్య ట్విట్టర్లో పోస్టు చేసిన వీడియో ప్రస్తుతం వైరల్ అవుతోంది. వైద్య ఆ వీడియో ''సార్.. ఎన్నిసార్లు మీతో సెల్ఫీతో క్లిక్‌లు తీసుకున్నా.. నాకు తొలిసారి దిగిన ఫోటోలా వుంది'' అన్నాడు. 
 
అందుకు ధోనీ కూడా సెటైర్‌గా బదులిచ్చాడు. ''నువ్వు నన్ను అడుగుతున్నావా.. లేకుంటే చెప్తున్నావా'' అన్నాడు. కాగా ధోనీ ఇటీవల ముంబైలో ఫుట్ బాల్ మ్యాచ్ ఆడాడు. బుధవారం (నవంబర్ 21)న ముంబైలో బాలీవుడ్ నటులు రణ్‌బీర్, అభిషేక్ జట్టుతో కలిశాడు. ధోనీ, అభిషేక్ కో-ఓనర్లుగా చెన్నైయిన్ ఎఫ్సీ అనే ఫుట్ బాల్ టీమ్‌కు వ్యవహరిస్తున్నారు. అలాగే రణ్ బీర్ ముంబై సిటీ ఎఫ్‌సీకి ఓనర్‌గా వ్యవహరిస్తున్నాడు. 
 
ధోనీ 2014లో టెస్టుల నుంచి తప్పుకున్నాడు. ధోనీ కెప్టెన్సీలో భారత్ ట్వంటీ-20 ప్రపంచ కప్ (2007), వన్డే వరల్డ్ కప్ (2011)లను గెలుచుకున్న సంగతి తెలిసిందే. ఇంకా 2013లో ఇంగ్లండ్‌లో జరిగిన ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీలో ఆడిన టీమిండియా జట్టుకు మహేంద్ర సింగ్ ధోనీ కెప్టెన్‌గా బాధ్యతలు చేపట్టిన సంగతి తెలిసిందే.